breaking news
pentagon official
-
‘డిఫెన్స్ కాదు.. ఇకపై యుద్ధమే’.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనలో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ శాఖను ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’గా నామకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో ఎగ్గిక్యూటీవ్ ఆర్డర్‌ను పాస్ చేయనున్నారు. అనంతరం, ప్రస్తుతం రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మినిస్టర్‌గా పిలిపించుకోనున్నారు. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం.. ట్రంప్ త్వరలోనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయనున్నారు. తద్వారా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించేందుకు అనుమతి లభిస్తుంది. దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పేరొందిన పెంటగాన్ (Pentagon) రక్షణ కార్యాలయం అధికారిక పోర్టల్స్, సైన్య సంబంధిత బోర్డులు, మీడియా రూమ్‌లు కూడా ఈ మార్పుకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాస్తా.. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్, రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ మీడియాతో మాట్లాడారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతో అమెరికా గతంలో ప్రపంచ యుద్ధాల్లో విజయాలు సాధించింది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’ అనే పేరు మారిన తర్వాత ఆ పోరాట స్పూర్తి తగ్గిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హెగ్సెత్ కూడా ఈ మార్పును సాంస్కృతిక మార్పుగా అభివర్ణించారు. మేము కేవలం రక్షణ మాత్రమే కాదు.. దాడులు కూడా చేస్తాం. వాటికి అనుగుణంగా పేర్లు ఉండటం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.పేరు మార్పు దేనికి సంకేతం1949 వరకు అమెరికా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతోనే సైనిక వ్యవహారాలను నిర్వహించేది. తరువాత నేషనల్ సెక్యూరిటీ చట్టం ద్వారా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’గా మార్పు జరిగింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మళ్లీ ఆ చారిత్రక పేరును తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మార్పు అమెరికా రాజకీయాల్లో, సైనిక విధానాల్లో కొత్త దిశకు సంకేతమా? అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.ట్రంప్ వ్యూహమారక్షణ శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్) పేరును యుద్ద శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ వార్)గా మార్చడంలో ట్రంప్ వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్‌లో ‘వార్’ అనే పదం రక్షణ కంటే దాడి, శక్తి సూచిస్తుంది. అదే సమయంలో ప్రపంచదేశాల ఎదుట తమ దేశ యుద్ధ సామర్థ్యాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నట్లేనని భావించవచ్చు. ఈ పేరు మార్పు రాజకీయ నాయకుడిగా దేశ భద్రతపై అతని దృష్టిని ప్రతిబింబించవచ్చు. ట్రంప్ ఈ మార్పును ప్రతిపాదించినప్పుడు, ఆయన ఉద్దేశం అమెరికా సైన్యానికి మరింత దృఢత్వాన్ని ఇవ్వడమే అని చెప్పారు. మరికొందరు మాత్రం.. ట్రంప్ యుద్ధాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగమేనంటూ పెదవి విరుస్తున్నారు. -
భారత్-రష్యా బంధంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు
భారత్-రష్యా బంధంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ రక్షణ అవసరాలకు సంబంధించి రష్యాపై ఆధారపడటాన్ని ఏమాత్రం తాము ప్రోత్సహించడంలేదని యూఎస్ రక్షణ కార్యాలయం పెంటగాన్ అభిప్రాయపడింది. భారత్ రక్షణ అవసరాల విషయంలో రష్యాలపై అధికారపడటం మానుకోవాలని పేర్కొంది. భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడం ఆపేయాలని భావిస్తున్నామని వెల్లడించింది. ఈ విషయంలో తమకు ఎటువంటి ఉద్దేశంలేదని తెలుపుతునే.. ఆ అంశాన్నిఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించమని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ తెలిపారు. భారత్‌తో ఉన్న రక్షణ బంధానికి తాము విలువ ఇస్తామని అదేవిధంగా అమెరికా-ఇండియా మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉపఖండంలో భద్రతను కల్పించేది భారత్ అని ఆ విషయాన్ని తాము ఎల్లప్పుడు గుర్తిస్తామని తెలిపారు. 2018లో ట్రంప్ ప్రభుత్వం నిరాకరించినా భారత్ మాత్రం రష్యా నుంచి ఎస్-400 ట్రియంప్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను కొనుగులుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎస్-400 మిస్సైళ్లు కొనుగోలు చేసిన టర్కీపైన అమెరికా నిషేధం విధించిన విషయం విదితమే. -
ఐసిస్ చేతిలో రసాయన ఆయుధాలు?
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పరిస్థితి తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుంది. ఇరాకీ దళాలు మోసుల్ నగరంవైపు దూసుకుని వస్తుండటంతో.. వారిపై రసాయన దాడులు చేయడానికి సిద్ధపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ పెంటగాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత మంగళవారం నాడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్ అమెరికా దళాలు ఉన్న ప్రాంతానికి కొన్ని వందల గజాల దూరంలో పడింది. దాన్ని రసాయన ఆయుధాలతో ప్రయోగించినట్లు తర్వాత తేలింది. ఇరాక్ దళాలు మోసుల్ నగరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోడానికి వీలుగా ఒక ఎయిర్‌ఫీల్డ్‌ను అక్కడ అమెరికా సైనికులు సిద్ధం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ దాడిలో ఎవరూ గాయపడలేదు. మొదట్లో ఆ రాకెట్లో కేవలం ఆవాలకు సంబంధించినదే అనుకున్నారు గానీ, తర్వాత చేసిన పరీక్షలో అందులో రసాయన ఆయుధాలు ఉన్నట్లు తేలిందని నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ విలేకరులకు తెలిపారు. ఇంతకుముందు కూడా ఐసిస్ ఇలాంటి దాడులు చేసి ఉంటుందని, కనీసం రెండు డజన్ల సార్లు వాళ్లు ఈ తరహా ఆయుధాలను ప్రయోగించి ఉంటారని అన్నారు. శుక్రవారం నాడు ఖయ్యారా సమీపంలో ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన రసాయన ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సైన్యం ధ్వంసం చేసింది. ఆవాల నూనెను ఆయుధంగా మార్చుకునే సామర్థ్యం ఐసిస్‌కు వచ్చిందని, వాళ్లు ఈ నూనెతో పాటు మరో రసాయన పదార్థాన్ని కలిపి దాన్ని ఆయుధంలా చేస్తున్నారని డేవిస్ అన్నారు. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉండకపోవచ్చు గానీ.. బాగా ఇబ్బంది కలిగిస్తుందని, సైనిక పరంగా దీన్ని అంత పెద్ద ముప్పుగా తాము పరిగణించబోమని అన్నారు. రసాయనాలను ఆయుధాలుగా మార్చడంలో ఐసిస్‌కు ఇంకా అంత నైపుణ్యం లేదు గానీ, ఒకవేళ వాళ్లు అలాంటి దాడులు చేస్తే ఎదుర్కోడానికి అమెరికా.. ఇరాకీ దళాలు మాత్రం ఇంకా సన్నద్ధం కావాల్సి ఉందని చెప్పారు. ఇరాక్ ప్రాంతానికి అమెరికా 50 వేల గ్యాస్ మాస్కులను పంపిందని, వాటిలో 40 వేల మాస్కులు కేవలం ఇరాకీ సైన్యానికే వెళ్తాయని తెలిపారు.