US midterm elections 2022: లాస్‌ ఏంజెలిస్‌ మేయర్‌గా నల్లజాతి మహిళ

US midterm elections 2022: Karen Bass becomes the first female mayor of Los Angeles - Sakshi

చరిత్ర సృష్టించిన కరీన్‌ బాస్‌

లాస్‌ ఏంజెలిస్‌: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా జరిగిన లాస్‌ ఏంజెలిస్‌ మేయర్‌ పదవిని మొట్టమొదటిసారిగా ఒక నల్లజాతి మహిళ కైవసం చేసుకుంది. లాస్‌ ఏంజెలిస్‌కు ఒక మహిళ మేయర్‌ కావడం ఇదే తొలిసారి. 40 లక్షల జనాభా ఉన్న లాస్‌ఏంజెలిస్‌ను పలు సమస్యలు చుట్టుముట్టిన వేళ రిపబ్లికన్‌ అభ్యర్థి, కుబేరుడు రిక్‌ కరుసోపై డెమొక్రటిక్‌ మహిళా అభ్యర్థి కరీన్‌ బాస్‌ దాదాపు 47,000 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 70 శాతానికిపైగా ఓట్ల లెక్కింపు పూర్తవడంతో కరీన్‌ బాస్‌ గెలుపు దాదాపు ఖరారైనట్లే. రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థుల షార్ట్‌ లిస్ట్‌లోనూ కరీన్‌ పేరు ఉండటం గమనార్హం. లాస్‌ ఏంజెలిస్‌ మేయర్‌ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రిక్‌ కరుసో ఏకంగా దాదాపు రూ.817 కోట్లకుపైగా ఖర్చుపెట్టినట్లు వార్తలొచ్చాయి. ‘ ఈ ఎన్నికలు మనీకి సంబంధించినవి కాదు. మనుషులకు సంబంధించినవి’ అని ప్రచారం సందర్భంగా కరీన్‌ బాస్‌ వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top