California Storm: కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం.. 19 మంది మృతి.. వేల మంది..

US California Storm Many Dead Thousands Evacuated - Sakshi

కాలిఫోర్నియా: అమెరికా కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల దాటి వరదలు సంభవించాయి. డ్యాములు పొంగిపొర్లాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు వాగులను తలపించాయి. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

శీతకాల వర్షాల ధాటికి కాలిఫోర్నియాలో వరదలతో పాటు కొండచరియులు విరిగిపడ్డాయి. పలు చోట్ల భూమికి పగుళ్లు వచ్చాయి. తుఫాన్ కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మొత్తం 19 మంది చనిపోయినట్లు శ్వేతసౌధం అధికారిక ప్రకటనలో తెలిపింది. 

కాలిఫోర్నియాలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 14,411 మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం కూడా తుఫాన్ ముప్పు ఉందని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాలిఫోర్నియా తర్వాత ఈ తుఫాన్ లాస్ ఏంజెల్స్ వైపు వెళ్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
చదవండి: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదం.. 10 సెకన్ల ముందు వీడియో వైరల్..

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top