క్రిమియాకు ఎందుకంత క్రేజ్? 

Ukraine Russia War: What Is Special About Crimea - Sakshi

అటు రష్యాకు, ఇటు ఉక్రెయిన్ కు అది ముఖ్యమే

క్రిమియా.. ఉక్రెయిన్ ప్రావిన్స్ లోని ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం రష్యా అధీనంలో ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ప్రాంతం అటు రష్యాకు కీలకం, ఇటు ఉక్రెయిన్ కి  కీలకంగా మారింది.  2022ను ఉక్రెయిన్ కి అత్యంత విషాదకరంగానూ, అదే సమయంలో చారిత్రాత్మక విజయాలతో  సంతోషాన్ని అందించిన సంవత్సరంగా చెప్పుకోవాలి. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవటానికి రష్యా,    ఫిబ్రవరి 2022లో  1,90,000 మీద ట్రూపులతో దాడికి దిగింది.  

వేలాది మంది ప్రాణాలను బలిగొంది. చెప్పుకోలేనంత విధ్వంసాన్ని సృష్టించింది. కాని యుద్ధం ప్రారంభమైన కొన్నివారాల్లోనే ఉక్రెయిన్ సైన్యం దాన్ని సమర్థవంతంగా తిప్పిగొట్టగలిగింది. ఆగస్టు నాటికి, రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో సగానికి పైగా తిరిగి స్వాధీనం చేసుకుని, ఆ దేశం విజయావకాశాలపైన నీళ్లు చల్లింది. 

రష్యా బడాయి కబుర్లు
ఉక్రెయిన్ కి సంబంధించిన నాలుగు ప్రావిన్సులు.. డొనెట్స్క్, ఖెర్సాన్, లుహాన్స్క్, జపొరిజియాలను తాము స్వాధీనం చేసుకున్నామని గత ఏడాది సెప్టెంబరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.  అదంతా ఒట్టిమాట. పుతిన్ ఈ ప్రకటన చేసే సమయానికి ఇందులో ఏ ఒక్క ప్రావిన్స్ పైన ఆ దేశానికి పట్టు లేదు. అంతే కాదు. సైన్యం దాదాపుగా అక్కడ గ్రౌండ్  కోల్పోయింది. 

పొరపాటును దిద్దుకున్నాం : పుతిన్
ఉక్రెయిన్ ప్రావిన్స్ కి చెందిన క్రిమియా ప్రస్తుతం రష్యా ఆధీనంలో  ఉంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించి, 2014లో ఆ దేశాన్ని ఉక్రెయిన్ నుంచి అది  హస్తగతం చేసుకుంది.  1954లో క్రిమియాను ఉక్రెయిన్ కు బదలాయించటం తప్పని, దానిని తిరిగి స్వాధీనం చేసుకోవటం ద్వారా చేసిన తప్పును దిద్దుకున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.  క్రిమియాను తిరిగి దక్కించుకోవటం వల్ల  అంతర్జాతీయంగా కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతున్నామని చెప్పారు. 

అది ఒట్టిమాట
ఇది తప్పుడు వాదనే. క్రిమియాకు విశిష్టమైన, సంపద్వంతపైన చరిత్ర ఉంది. ఎంతో కాలంగా అది రష్యాలో భాగంగా ఉన్న మాట నిజమే అయినా, 1991లో దేశవ్యాప్తంగా చేపట్టిన రిఫరెండం ద్వారా ఉక్రెయిన్లు.. అందులో అధికభాగం క్రిమియన్ లో నివసిస్తున్న వాళ్లంతా దానిని సోవియెట్ యూనియన్ నుంచి విముక్తం కావాలని కోరారు. వాళ్లంతా అలా కోరుకోవటానికి కారణం ఉంది. రష్యా అనేది నిరంకుశ రాజ్యం (టొటాలిటేరియన్ స్టేట్). ఉక్రెయిన్ అనేది ప్రజాస్వామ్యం  (ప్లురాలిస్టిక్ డొమోక్రసీ)  దిశగా అడుగులు వేస్తోంది. రష్యా పాలనలో క్రిమియాలో నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయి. మైనార్టీల అణచివేత, పౌరులను దుష్ప్రచారం చేసే మీడియాకు లోబడి ఉండాలని ఒత్తిడి కొనసాగుతోంది. వేలాది మంది క్రిమియన్ టాటర్ జాతుల వాళ్లు రష్యా కబంధహస్తాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. 

 పశ్చిమదేశాలదీ అదే అభిప్రాయం
2014లో క్రిమియాను రష్యా ఆధీనంలోకి తెచ్చుకోవటం అనేది సరైన నిర్ణయం కాదని అనే విషయంలో పశ్చిమదేశాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కానీ దానిని విముక్తం చేయటానికి అవి ఎలాంటి ప్రయత్నం చేయటం లేదు. పైగా క్రిమియాను ఉక్రెయిన్ లో సంఘటితం చేసేందుకు సాగే ప్రయత్నాలు, రష్యాను రెచ్చగొడితే, పుతిన్ న్యూక్లియర్ యుద్ధానికయినా వెనకాడబోడన్న   భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. అంతకంటే క్రిమియాను పొందటానికి  తన రాజధాని కివీని అందించేందుకు ప్రతిపాదనలు చేసుకోవచ్చని చెబుతున్నాయి.

క్రిమియాకు ఎందుకంత  ప్రాధాన్యం?
క్రిమియాకు రష్యాతో దశాబ్దాల అనుభవం ఉంది. సెవస్టొపోల్ అనే దానికి రష్యాతో చారిత్రక అనుబంధం ఉంది.  ఎక్కువ మంది ప్రజలు రష్యన్ భాష మాట్లాడతారు. సెవస్టొపోల్ రష్యన్ నౌకాస్థావరంగా ఉంది.  దీనికి దక్షిణ తీరంలో విలాసవంతమైన చారిత్రక రాజప్రాసాదాలు ఉన్నాయి.  1783లో రష్యా స్వాధీనం చేసుకునేవరకూ దానిని ఎందరో రాజులు పాలించారు.  ఇక్కడ ఎన్నో జాతులు ఉన్నాయి. 

ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవటానికి  రష్యా  ఈ  ప్రాంతాన్ని సైనిక స్థావరంగా మలుచుకుంది. 2014 తర్వాత  20 లక్షల మంది రష్యా పౌరుల్లో దాదాపు ఏడులక్షల మంది అక్కడకు మకాం మార్చారు. 

ఉక్రెయిన్ నుంచి క్రిమియాను లాక్కోవటానికి రష్యాకు ఎనిమిదేళ్లు పట్టింది. అక్కడ తగినంత మంది సైనిక పటాలాన్ని ఉంచింది.  ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంలో రష్యా ఈ భూభాగాన్ని వినియోగించుకుంటోంది.  క్రిమియన్ లో ఉన్న బ్లాక్ సీ నావికాదళాన్ని ఉపయోగించుకుంటోంది. అలాగే ఇక్కడ ఎయిర్ బేస్ నుంచి డ్రోన్, మిస్సెల్ దాడులను నిర్వహిస్తోంది. 

రష్యా దీనిని ఆక్రమించుకోవటం ద్వారా అటు బ్లాక్ సీ, ఇటు అజోవ్ సీల పైన పట్టు సాధించింది. యురేషియన్ ఖండం రవాణాకు  అది సముద్ర మార్గం . సీపోర్టులను, రవాణాలను అది నియంత్రించగలుగుతోంది.  ఇక్కడ నుంచే బొగ్గు, ఇనుపఖనిజం, ఇతరత్రా రవణా అవుతున్నాయి.

క్రిమియాను స్వాధీనం చేసుకుంటే గానీ ఉక్రెయిన్ సురక్షితంగా ఉండలేదు. తన ఎకానమీని పునరుద్ధరించుకోలేదు.  2018లో అజోవ్ సీ పైన రష్యా పట్టు సాధించినప్పటి నుంచి ఉక్రెయిన్ కి చెందిన  మరియుపోల్,  బెర్డియాన్స్ కో ఎయిర్ పోర్టులలో రవాణా తగ్గింది.   బ్లాక్ సీ లో ఎన్నో సహజమైన గ్యాసు వనరులున్నాయి. ఒకప్పుడు ఉక్రెయిన్ దానిని సొంతం       చేసుకోవాలన్న ప్రయత్నం చేసింది. ఎక్సోన్ మొబిల్ తో ఆరు బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకుంది. రష్యా ఆక్రమణతో అది చేజారిపోయింది.   క్రిమియా రష్యా చేతుల్లో ఉన్నంత వరకూ, ఆ దేశంపైన పై చేయి సాధించటం అనేది ఉక్రెయిన్ కు కష్టసాధ్యమైన విషయమే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top