సునాక్‌పై పార్లమెంటరీ కమిషనర్‌ విచారణ! | UK PM Rishi Sunak Faces Parliamentary Probe Over Wife Akshata Business Interest - Sakshi
Sakshi News home page

సునాక్‌పై పార్లమెంటరీ కమిషనర్‌ విచారణ!

Apr 18 2023 6:26 AM | Updated on Apr 18 2023 10:07 AM

UK PM Rishi Sunak faces parliamentary probe over wife Akshata business interest - Sakshi

లండన్‌: తన భార్య అక్షతా మూర్తి నిర్వహిస్తున్న ‘కొరు కిడ్స్‌ లిమిటెడ్‌’ అనే సంస్థకు లబ్ధి చేకూరేలా బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రకటించారని బ్రిటిష్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి ‘యూకే పార్లమెంటరీ కమిషనర్‌ ఫర్‌ స్టాండర్స్‌’ విచారణ ప్రారంభించింది. అతి త్వరలో రిషి సునాక్‌ను ప్రశ్నించనుంది. కొరు కిడ్స్‌ లిమిటెడ్‌ సంస్థ చిన్నపిల్లల సంరక్షణ సేవలను అందిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement