అతివాద బోధకులకు బ్రిటన్‌లోకి నో ఎంట్రీ | UK plans stringent measures against extremist infiltration | Sakshi
Sakshi News home page

అతివాద బోధకులకు బ్రిటన్‌లోకి నో ఎంట్రీ

Mar 4 2024 5:41 AM | Updated on Mar 4 2024 5:41 AM

UK plans stringent measures against extremist infiltration - Sakshi

లండన్‌: పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, ఇండోనేసియా వంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్‌ విద్వేష ప్రబో ధకులను దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని బ్రిటిష్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసిందని ‘డైలీ టెలీగ్రాఫ్‌’ తెలిపింది.

తీవ్రవాద కార్యకలాపాలు ఊహించని రీతిలో పెరుగుతుండటం పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చే అతివాద మత ప్రబోధకులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారి పేర్లను వీసా హెచ్చరిక జాబితాలో చేరుస్తారు. వీరికి దేశంలోకి ప్రవేశించే దారులు మూసుకుపోతాయని ‘డైలీ టెలీగ్రాఫ్‌’ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement