
అభ్యంతరకరమంటూ నెటిజన్ల విమర్శలు
వాషింగ్టన్: మహిళలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపు ఇప్పుడు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్(27)పై పడింది. ఆమె అందరికంటే ఉత్తమ సెక్రటరీ అంటూ కితాబివ్వడంతోపాటు పలు విపరీత పొగడ్తలు కురిపించారు. న్యూస్‌మ్యాక్స్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో ట్రంప్.. లెవిట్‌ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశారు.
అధికార పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే ట్రంప్ ఆరు ప్రాంతాలకు సంబంధించిన కాల్పుల విరమణ ఒప్పందాలను కుదిర్చారంటూ శుక్రవారం మీడియా సమావేశం సందర్భంగా ట్రంప్‌పై లెవిట్ ప్రశంసలు కురిపించారు. ‘లెవిట్ పెద్ద స్టారైపోయారు. ఆ ఫేస్..ఆ బ్రెయిన్ అద్భుతం. ఆమె పెదాలు అబ్బో..అవి కదులుతుంటే అచ్చు మెషీన్ గన్ లాగే ఉంటాయి’అంటూ పేర్కొన్నారు. ఆమె చాలా గొప్పవ్యక్తి.
కరోలిన్ కంటే ఉత్తమ ప్రెస్ సెక్రటరీ ఇప్పటి వరకు ఎవరూ లేరనే అనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదంటూ నెటిజన్లు తప్పుబట్టారు. ఆయన పొగడ్తలు అసౌకర్యం, భయంకరం, అనవసరం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ బెస్ట్‌ఫ్రెండ్ మాట్లాడినట్లే ఉందంటూ ఎద్దేవా చేశారు. గతంలో ట్రంప్, ఎప్‌స్టీన్ మధ్య కొనసాగిన మైత్రి వివాదాస్పదంగా మారడం తెల్సిందే.
‘అదే ఒక వ్యక్తి తన మహిళా కొలీగ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి, కోర్టు బోనెక్కించేవారు అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. వృత్తిపరమైన ప్రవర్తనలో ద్వంద ప్రమాణాలకు ఇదే ఉదాహరణ అంటూ ఆ యూజర్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మీడియా ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రధాన మీడియా సంస్థలు గానీ, వైట్ హౌస్ గానీ ఈ విపరీత వ్యాఖ్యలపై ట్రంప్‌ను ప్రశి్నస్తాయా అంటూ నిలదీస్తున్నారు.