రూ.1,460 కోట్ల బాండ్‌ సమర్పించిన ట్రంప్‌

Trump posts 175 million bond in New York fraud case - Sakshi

న్యూయార్క్‌: ఆస్తులను ఎక్కువ చేసి చూసి రుణాలు, బీమాలు పొంది బ్యాంక్‌లు, బీమా సంస్థలను మోసం చేశారన్న కేసులో కోర్టు ఆదేశాల మేరకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏకంగా రూ.1,460( 17.5 కోట్ల డాలర్లు) విలువైన ష్యూరిటీ బాండ్‌ను న్యూయార్క్‌ కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో గతంలో రూ.3,785 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు గతంలో ట్రంప్‌కు సూచించింది.

దీనిపై ట్రంప్‌ పై కోర్టులో సవాల్‌ చేస్తామని చెప్పారు. అయితే ఆలోపు ఆస్తుల జప్తు ఆగాలంటే కనీసం 17.5 కోట్ల డాలర్ల బాండ్‌ను తమకు సమర్పించాలంటూ ట్రంప్‌కు న్యూయార్క్‌ అప్పీలేట్‌ కోర్టు 10 రోజుల గడువు ఇచ్చిన తెల్సిందే. దీంతో ట్రంప్‌ ఎట్టకేలకు అంతటి భారీ మొత్తానికి బాండ్‌ సమర్పించారు. దీంతో ట్రంప్‌ ఆస్తుల జప్తు తాత్కాలికంగా ఆగింది. 45.4 కోట్ల డాలర్ల(రూ.3,785 కోట్ల) జరిమానా సంబంధిత ఈ కేసులో ట్రంప్‌ ఒక వేళ గెలిస్తేనే ఈ రూ.1,460 కోట్ల బాండ్‌ను ఆయనకు తిరిగి ఇస్తారు. ఓడితే ట్రంప్‌ మొత్తం 45.4 కోట్ల డాలర్ల జరిమానాను రోజువారీ వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.

Election 2024

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top