తూచ్.. మేము బాంబులెయ్యం! | Trump Cancels Planned Strikes on Iran After Breakthrough Talks | Sakshi
Sakshi News home page

తూచ్.. మేము బాంబులెయ్యం!

Jun 11 2026 11:45 PM | Updated on Jun 11 2026 11:53 PM

Trump Cancels Planned Strikes on Iran After Breakthrough Talks

ఈ రాత్రి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేశారు. అయితే తాజాగా.. డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ప్రకటన చేశారు. ఇందులో ''ఈ సాయంత్రం ఇరాన్‌పై జరగాల్సిన వైమానిక దాడులను, బాంబు దాడులను రద్దు చేశాను'' అని పేర్కొన్నారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో చర్చలు ఇరాన్ నాయకత్వంలోని అత్యున్నత స్థాయికి చేరి, ఆమోదం పొందాయి. కాబట్టి నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా, ఈ సాయంత్రం ఇరాన్‌పై జరగాల్సిన దాడులను రద్దు చేశాను. తుది ఒప్పందానికి అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్, ఇతరులతో సహా ఇందులో పాలుపంచుకున్న అన్ని పక్షాలు, ఈ చర్చలకు ఆమోదం తెలిపాయి.

ఒప్పందం ఖరారయ్యే వరకు.. నౌకాదళ దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో ఉంటుంది. తుది ఒప్పందానికి సంబంధించిన సమయం, ప్రదేశం వంటి విషయాలను తాను అధికారికంగా ప్రకటించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement