వెరైటీ డ్రెస్‌తో 43 ఏళ్ల తర్వాత తండ్రి చెంతకు

Son Meets Father In ELF Costume For The First Time In Boston - Sakshi

బోస్టన్‌ : హాలీవుడ్‌ సినిమా ఈఎల్‌ఎఫ్‌ చూసిన వారికి హీరో విల్‌ ఫెర్రల్‌ తండ్రిని కలుసుకునే సీను గుర్తుండే ఉంటుంది. మొదటి సారి తండ్రిని కలుసుకునే ఆ సీనులో అద్భుతంగా నటించాడు విల్‌.  2003లో వచ్చిన ఈఎల్‌ఎఫ్‌ సినిమాను చూసి, విల్‌ పాత్రనుంచి స్పూర్తి పొందాడు అమెరికాలోని బోస్టన్‌కు చెందిన డోగ్‌ హెన్నింగ్‌ వోర్‌ అనే వ్యక్తి. అందుకే 43 ఏళ్ల తర్వాత మొదటిసారి తండ్రిని కలవడానికి ఆ సినిమాలో విల్‌ ధరించే దుస్తుల్లాంటి వాటినే ధరించాడు. చిన్నప్పుడే తండ్రినుంచి దూరమైన డోగ్‌ పెంపుడు తల్లిదండ్రుల వద్ద పెరిగాడు. యాన్‌సెస్టరీ.కామ్‌ ద్వారా అతడి తోబుట్టువులను కనుక్కున్నాడు. అనంతరం ఆన్‌లైన్‌లో తండ్రితో మాట్లాడేవాడు. గత మంగళవారం బోస్టన్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. ( వధువుకు కరోనా: అయినా పెళ్లి ఆగలేదు )

ఈ సందర్భంగా సినిమా కాస్ట్యూమ్‌ ధరించాడు డోగ్‌. అంతేకాదు సినిమాలోని పాటను పాడుతూ హుషారుగా తండ్రిని చేరాడు. అయితే డోగ్‌ తండ్రి ఈఎల్‌ఎఫ్‌ సినిమా చూడకపోవటంతో అసలు సంగతి తెలియలేదు. డోగ్‌ విచిత్ర వేష ధారణను చూసి కొద్దిగా ఆశ్చర్యపోయాడు. దీనిపై డోగ్‌ మాట్లాడుతూ.. ‘‘అలా ఆ డ్రెస్‌లో వెళ్లటం నాకు మంచిదని పించింది. కానీ, ఆయన ఎయిర్‌పోర్టునుంచి బయటకు వచ్చి నన్ను చూడగానే పిచ్చోడిననుకుని ఉంటారు’’ అని అన్నాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top