Somalia Passengers Plane Veers Off Runway After Crash-Landing At Airport - Sakshi
Sakshi News home page

సోమాలియాలో విమానం క్రాష్ లాండింగ్.. వేగంగా వచ్చి  కంచెను ఢీకొని..

Jul 13 2023 4:07 PM | Updated on Jul 13 2023 4:25 PM

Somalia Airlines Plane Veers Off Runway All Onboard Survive - Sakshi

సోమాలియా: హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానం సోమాలియా మొగదిషు విమానాశ్రయంలో క్రాష్ లాండింగ్ అయ్యింది. సిబ్బంది సహా అందులో ప్రయాణిస్తున్న సుమారు 34 మంది సురక్షితంగా బయటపడ్డారు. 

అడెన్ అడె విమానాశ్రయంలో ఒక విమానం సాంకేతిక లోపం కారణంగా వేగంగా రన్ వే మీదకు దూసుకొచ్చి క్రాష్ లాండింగ్ అయ్యింది. విమాన తాకిడికి ప్రహారీ కంచె తునాతునకలైంది. ఇంతటి ప్రమాదం జరిగినా కూడా విమానంలో  ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. లేచిన వేళా విశేషం బాగుంది కాబట్టే బ్రతికి బట్టకట్టామని ప్రయాణికులు షాక్ నుండి బయటపడి ఆశ్చర్యంతో  సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయాన్ని స్థానిక విలేఖరి ఒకరు వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన E 120 తరహా విమానం అడెన్ అడె అంతర్జాతీయ విమానాశ్రయంలో 5వ నెంబర్ రన్ వే మీద క్రాష్ లాండింగ్ అయ్యింది. సోమాలియా సివిల్ ఏవియేషన్ అధారిటీ తెలిపిన వివరాల ప్రకారం విమానంలో 34 మంది పాసింజర్లు ఉండగా అందరూ సురక్షితంగా బయట పడ్డారని ఒక్కరికి మాత్రమే చిన్న చిన్న గాయాలయ్యాయని తెలిపారు.  వీడియో చూశాక అందులోని వారికెవ్వరికీ ఏమీ కాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. 

ఇది కూడా చదవండి: నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement