Snake Found Under Christmas Tree In Australia Video Goes Viral - Sakshi
Sakshi News home page

Snake In Christmas Tree: ఇంట్లో క్రిస్మస్‌ వేడుకలు.. ఎలా వచ్చిందో గానీ సడన్‌గా ప్రత్యక్షమైంది!

Dec 1 2021 1:54 PM | Updated on Dec 1 2021 3:12 PM

Snake Found Under Christmas Tree In Australia Video Goes Viral - Sakshi

డిసెంబర్‌ నెల అంటేనే క్రిస్మస్‌ సీజన్‌. నెల ప్రారంభం నుంచి క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమవుతాయి. ఇంటిని అలంకరించడండతో మొదలు కొని అన్నీ ఏర్పాట్లతో బిజీబిజీగా గడుపుతుంటారు. క్రిస్మస్‌ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది క్రిస్మస్‌ ట్రీ. క్రిస్మస్ రాక ముందు నుంచే ఈ చెట్టును తమ ఇంటిలో ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. సరిగ్గా ఇలాగే ఓ పెద్ద క్రిస్మస్ చెట్టును ఇంటికి తీసుకొచ్చారు. దానిని అందంగా ముస్తాబు చేస్తుండగా ఓ విషపూరితమైన పాము కనిపించింది. ఆ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.
చదవండి: ఓరి వీడి వేశాలో... తల ఆరబెట్టాలంటే ఇలా చేయాలా!

ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో నివసిస్తున్న ఓ కుటుంబం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రిస్మస్ ట్రీని ఇంటికి  తీసుకొచ్చారు. దానికి రిబ్బన్లు, రంగుల దీపాలు, కొవ్వొత్తులతో అలంకరిస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా క్రిస్మస్ చెట్టు నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వారంతా దాన్ని తీక్షణంగా పరిశీలించగా.. రిబ్బన్ స్థానంలో ఓ విషపూరితమైన పాము చుట్టుకుని కనిపించింది.  దీనితో భయభ్రాంతులకు గురైన ఆ కుటుంబం వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని ఇచ్చారు. సుమారు గంటన్నర పాటు శ్రమించిన అతడు.. ఆ పామును చెట్టును నుంచి తీసి దూరంగా అడవుల్లో విడిచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: ఇంట్లో క్రిస్మస్‌ వేడుకలు.. ఎలా వచ్చిందో గానీ సడన్‌గా ప్రత్యక్షమైంది!

Advertisement
 
Advertisement
Advertisement