టిక్‌టాక్‌ పిచ్చి.. డాక్టర్‌ వికృత చేష్టలు.. ఆపరేషన్‌ మధ్యలోనే వదిలేసి.. | Australia Plastic Surgeon Posting TikToks During Surgery Banned From Practising | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ పిచ్చి.. డాక్టర్‌ వికృత చేష్టలు.. ఆపరేషన్‌ మధ్యలోనే వదిలేసి..

Nov 30 2021 6:19 PM | Updated on Nov 30 2021 9:12 PM

Australia Plastic Surgeon Posting TikToks During Surgery Banned From Practising - Sakshi

ఇటీవల కాలంలో జనాలు సామాజకి మాధ్యమాలకు ఎలా బానిసవుతున్నారో మనం చూస్తునే ఉన్నాం. అంతేందుకు ఆ వ్యసనం కారణంగా ఎలా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారో కూడా చూస్తున్నాం. అచ్చం అలానే ఇక్కడోక ప్రముఖ డాక్టర్‌ సామాజకి మాధ్యమాలకు బానిసై తన చక్కటి కెరియర్‌ను ఎలా పాడుచేసుకున్నాడో చూడండి.

(చదవండి: జపాన్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు..!!)

అసలు విషయంలోకెళ్లితే...టిక్‌టాక్ వ్యసనం ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ డేనియల్ అరోనోవ్ కెరియర్‌ను దెబ్బతీసింది. అరోనోవ్‌కి టిక్‌టాక్‌లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారంటే అతనికి ఎంత టిక్‌టాక్‌ పిచ్చి ఉందో తెలుస్తోంది. అయితే అతను టిక్‌టాక్‌ పిచ్చితో ప్లాస్టిక్‌ సర్జరీకి సంబంధించిన ఆపరేషన్‌లు అన్నింటిని టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసేవాడు. అంతేకాద ఆపరేషన్లు అన్నింటిని అసంపూర్తిగా చేసేవాడు.

దీంతో పలువురు రోగుల నుంచి అరోనోవ్ పై  ఫిర్యాదుల రావడం ప్రారంభమైంది. పైగా అరోనోవా వికృత వ్యసనం ఎంతకు దారితీసింది అంటు రోగుల ఆరోగ్యంతో ఆడుకునేంత దారుణానికి దిగజారింది. ఈ మేరకు పలువురు రోగులు అతను శస్త్ర చికిత్సను మధ్యలోనే ఆపేస్తాడని, పైగా ఒకటి చేయబోయి మరోకటి చేస్తాడంటూ బాధితుల ఆవేదనగా ఫిర్యాదులు చేయడంతో ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రాక్టీషనర్ రెగ్యులేషన్ ఏజెన్సీ (ఏహెచ్‌పీఆర్‌ఏ) అతను ఎలాంటి శస్త్రచికిత్సా విధానాలను నిర్వహించకుండా నిషేధించింది. 

(చదవండి: బాప్‌రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement