బీజింగ్: సింగపూర్ నుంచి చైనాలోని గంగ్జూ పట్టణానికి వెళుతున్న స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం భారీ కుదుపులకు గురైంది. కదుపుల కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒక వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చించాల్సి వచ్చింది.
గంగ్జూ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం భారీ కుదుపులకు గురైనట్లు సిబ్బంది తెలిపారు. ఫ్లైట్ రాడార్ వివరాల ప్రకారం 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 25వేల అడుగులకు వచ్చేసింది. వేగం కూడా ఒక్కసారిగా 500 నాట్స్ నుంచి 262 నాట్స్‌కు తగ్గింది. తర్వాత మళ్లీ 35 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి 500 నాట్స్ వేగంతో ప్రయాణించింది.
Comments
Please login to add a commentAdd a comment