టెహ్రాన్: ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ పార్లమెంట్‌లోని జాతీయ భద్రతా కమిటీ ఛైర్మన్ ఇబ్రహీం అజీజీ స్పందించారు. ట్రంప్‌నకు మరింత శక్తిమంతమైన, మరింత బాధాకరమైన ప్రతిస్పందన ఎదురవుతుందని అజీజీ వార్నింగ్ ఇచ్చారు.
"ట్రంప్‌నకు సరైన అవకాశాలు లేవు కాబట్టి అతని చర్యలను ముందుగానే ఊహించవచ్చు. ట్రంప్ దాదాపు ఎలాంటి విజయాలు సాధించలేదు. అమెరికా ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు ఏమీ అందని విధంగా ఆయన భారీ మూల్యం చెల్లించాడు.
ఏదైనా తప్పుడు అంచనాతో అడుగు వేస్తే గతం కంటే మరింత బాధాకరమైన ప్రతిస్పందన వస్తుంది. ట్రంప్ హెచ్చరికలు భ్రమలు మాత్రమే. ఇరాన్ నుంచి వచ్చే ఏ ప్రతిస్పందనైనా ట్రంప్‌నకు భరించలేని పరిణామాలు తెచ్చిపెట్టవచ్చని ఆయనకు తెలుసు" అని ఆయన చెప్పారు.
కాగా, యూఎస్ హెచ్చరికలతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం అంతర్జాతీయంగా నెలకొంది.


