ఏనుగు పైకి నగ్నంగా: 'సిగ్గు లేదా?'

Russian Instagram Influencer Posed Naked On Top Of Elephant in Bali - Sakshi

మాస్కో: చాలామందికి ఏనుగెక్కాలన్న కోరిక ఉంటుంది. ఇక్కడ చెప్పుకునే యువతికి కూడా ఆ కోరిక ఉంది. కాకపోతే ఒంటి మీద నూలుపోగు లేకుండా ఏనుగెక్కి దానిమీద పడుకుంది. అవును, రష్యాకు చెందిన అలెస్య కఫెల్కికోవా అనే మోడల్‌ నగ్నావతారంలో సుమత్రా ఏనుగు మీదకు ఎక్కింది. పైగా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో చూసిన జనాలు తిట్ల దండకం అందుకున్నారు.

జంతు ప్రేమికులైతే 'ఛీ, ఏం చేస్తున్నావో తెలుస్తోందా?' అంటూ చీదరించుకుంటూనే చీవాట్లు పెట్టారు. 'ముందు గజరాజు మీద నుంచి కిందకు దిగు, నీ నగ్న ఫొటో షూట్‌లు, వీడియోలకు ఇంకేదైనా మార్గం వెతుక్కో. మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా?', 'నిన్ను బట్టలు లేకుండా చూడాలని ఇక్కడ ఎవరైనా తహతహలాడుతున్నారా? ఏంటా పిచ్చి వేషాలు?' అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. 'ఆ ఏనుగును చూస్తే జాలేస్తోంది, ఆ అవతారంలో దాని మీద ఎక్కినందుకు నీకు సిగ్గనిపించట్లేదా? అయినా డబ్బు మనుషుల్ని ఎంతకైనా దిగజార్చుతుంది' అని చెడామడా తిట్టారు. దీంతో ఆమె ఆ వీడియోను తొలగించింది.

అయితే ఏనుగులంటే తనకెంతో ఇష్టమని, అందువల్లే ఈ ఫొటోషూట్‌ చేసినట్లు పేర్కొంది. కొన్నేళ్లుగా చారిటీ కోసం పని చేస్తున్నానని, అందులో భాగంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం కూడా విరాళాలు ఇచ్చానని తెలిపింది. తన ఫొటో అభ్యంతరంగా అనిపించినందుకు క్షమాపణలు చెప్పింది. ప్రపంచ నెంబర్‌ వన్‌ టెన్నిస్‌ ఆటగాడు యెవ్‌గెనీ కఫెల్నికోవ్‌ కూతురే ఈ అలెస్య. 2015లో మోడల్‌గా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. ప్రముఖ ఫ్యాషన్‌ మ్యాగజైన్లు ఎల్లీ, వోగ్‌ కవర్‌ పేజీలపై కూడా ఆమె ఫొటోలు ప్రచురితమయ్యాయి.

చదవండి: ఏనుగు మృతి.. వెక్కివెక్కి ఏడ్చిన అధికారి

ఇదేం పోయే కాలం.. ఇలాంటి దొంగతనమా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top