‘ఆ భయంతోనే మెలానియా ఆలస్యం చేస్తున్నారు’

Reports Melania Will Not Leave Donald Trump Until January - Sakshi

ఒమరోసా న్యూమన్‌ వ్యాఖ్యలు

నిరాధార కథనాలు: మెలానియా ప్రతినిధులు

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధాన్ని వీడిన తర్వాతే ఆయన సతీమణి మెలానియా విడాకుల విషయం గురించి ఆలోచిస్తారని ట్రంప్‌నకు రాజకీయ సహాయకురాలుగా పనిచేసిన ఒమరోసా మానిగాల్ట్‌ న్యూమన్‌ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న సమయంలో విడిపోవడం గురించి ఆలోచిస్తే ట్రంప్‌ తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే మెలానియా అధికార ప్రతినిధులు మాత్రం ఒమరోసా వ్యాఖ్యలను ఖండించారు. ఇవన్నీ నిరాధార కథనాలు అంటూ కొట్టిపడేశారు. కాగా ట్రంప్‌తో 15 ఏళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికేందుకు  మెలానియా ఎదురుచూస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు

వీరిద్దరి బంధం గురించి ‘అన్‌హింగ్డ్‌’ పేరిట రాసిన పుస్తకంలో ఒమరోసా ప్రస్తావించడం వీటికి బలం చేకూర్చింది. ట్రంప్‌- మెలానియా మధ్య భార్యాభర్తల బంధం లేదని, అవసరం కోసమే కలిసి ఉంటున్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక విడాకులు తీసుకుంటున్నందుకు గానూ ట్రంప్‌.. తన మూడవ భార్య మెలానియాకు భరణం కింద సుమారు రూ. 500 ​కోట్లు చెల్లించనున్నారని ఓ పత్రికకు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమరోసా పేర్కొన్నారు. కాగా ట్రంప్‌- మెలానియా దాంపత్యానికి గుర్తుగా వారిద్దరికి బారన్ ట్రంప్ జన్మించాడు. అతడి వయస్సు ఇప్పుడు పద్నాలుగేళ్లు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అన్న ట్రంప్‌.. మంగళవారం ఎట్టకేలకు అధికార మార్పిడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.( (చదవండి: పరస్పర సహకారంతో ముందుకు సాగుదాం: జిన్‌పింగ్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top