PM Modi Tops Global Leader List With 78% Approval Rating: Report - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ నేత మోదీనే 

Feb 5 2023 9:43 AM | Updated on Feb 5 2023 11:24 AM

PM Modi Tops List Of Most Popular Global Leader - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగా ప్రధాని మోదీ మరోసారి ఘనత సాధించారు. ప్రపంచదేశాధినేతల్లో ఎవరికి అధిక మద్దతు ఉందని సర్వే చేసే అమెరికాకు చెందిన గ్లోబల్‌ లీడర్‌ అప్రూవల్‌ ట్రాకర్‌ సంస్థ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ ఈ సంవత్సరం సైతం తాజాగా ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో 78 శాతం మద్దతుతో మోదీ అగ్రస్థానంలో నిలిచారు.

ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌లనూ మోదీ వెనక్కి నెట్టడం విశేషం. మార్నింగ్‌ కన్సల్ట్‌ గత ఏడాది చేసిన సర్వేలో మోదీనే టాపర్‌గా నిలవడం విశేషం. మోదీ తర్వాత రెండోస్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రీస్‌ మాన్యువల్‌ లోపేజ్‌( 68 శాతం మద్దతు), మూడోస్థానంలో స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు అలేన్‌ బెర్‌సెట్‌(62 శాతం) ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఏడో, తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌ కేవలం 30 శాతం మద్దతుతో 13వ స్థానంలో ఆగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement