breaking news
global leaders
-
భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: భారతీయులు ముఖ్యంగా తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ వచ్చిన చంద్రబాబు సోమవారం అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. భారతీయులను గ్లోబల్ లీడర్లుగా ప్రమోట్ చేయడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో తాను బిల్‌గేట్స్‌తో మాట్లాడి హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్లే తెలుగువాడైన సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ కంపెనీ సీఈవోగా ఎదిగాడని చెప్పారు. ఎలివేషన్, స్పిరిట్ అంటే ఇలాగే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను వర్క్ ఫ్రం హోమ్ హబ్‌గా తీర్చిదిద్దుతానని, ఇందుకు ప్రవాసాంధ్రులు సహకరించాలని కోరారు. వర్క్ ఫ్రం హోమ్ ద్వారా రాష్ట్రంలోని గృహిణులకు అవకాశం వస్తే వారు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారన్నారు. ప్రభుత్వమే లైసెన్స్ ఫీజులు చెల్లించి ఏఐ, చాట్‌జీపీటీ వంటివాటిని రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి 12 దేశాల నుంచి తెలుగువారు వచ్చారని, ఇందులో అత్యధికంగా తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారని అన్నారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలగువారు నిరసన ప్రకటించి, తనకు మద్దతు ప్రకటించారని, ఎవరైనా చనిపోయిన తర్వాత పేర్లు గుర్తుపెట్టుకుంటారు కానీ, బతికుండగానే పేరు గుర్తుపెట్టుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. అనంతరం సీఎం రోడ్డు మార్గం ద్వారా దావోస్‌కు వెళ్లారు.సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనదావోలో చంద్రబాబు సోమవారం తొలిరోజు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీతో స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు కలిసి పనిచేసేలా చూడాలని కోరారు. అనంతరం మృధుల్ కుమార్ స్విట్జర్లాండ్‌కు చెందిన నాలుగు ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశపరిచారు. ‘స్విస్‌మెన్’ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లర్, ‘ఓర్లికాన్’ సీఈవో మార్కస్ టకే, ‘ఆంగ్సŠట్ ఫిస్టర్’ సీఈవో ఎరిచ్ స్మిడ్, ‘స్విస్ టెక్స్టైల్స్’ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్టెర్నల్ ఎఫైర్స్ జార్న్ వాన్ డెర్ క్రోన్‌కు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం వివరించారు. చంద్రబాబు, రేవంత్ భేటీజ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురుపడటంతో కాసేపు ఇరువురు కూర్చుని మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. -
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ నేత మోదీనే
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగా ప్రధాని మోదీ మరోసారి ఘనత సాధించారు. ప్రపంచదేశాధినేతల్లో ఎవరికి అధిక మద్దతు ఉందని సర్వే చేసే అమెరికాకు చెందిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ ఈ సంవత్సరం సైతం తాజాగా ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో 78 శాతం మద్దతుతో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్లనూ మోదీ వెనక్కి నెట్టడం విశేషం. మార్నింగ్ కన్సల్ట్ గత ఏడాది చేసిన సర్వేలో మోదీనే టాపర్‌గా నిలవడం విశేషం. మోదీ తర్వాత రెండోస్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రీస్ మాన్యువల్ లోపేజ్( 68 శాతం మద్దతు), మూడోస్థానంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలేన్ బెర్సెట్(62 శాతం) ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఏడో, తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ కేవలం 30 శాతం మద్దతుతో 13వ స్థానంలో ఆగిపోయారు. -
ప్రపంచ శక్తిగా భారత్ ఎదగాలంటే...
కేంద్ర ప్రభుత్వం తన విజన్ ఇండియా 2047 లక్ష్యసాధన కోసం పరిశోధన, సృజనాత్మకత, టెక్నాలజీలను ప్రధాన చోదక శక్తులుగా గుర్తించింది. ఈ లెక్కన 2047 నాటికి భారత్ ఒక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. స్థానికంగా ఆలోచిస్తూ, విస్తారంగా ప్రపంచ ప్రభావం కలిగించే స్టార్టప్, వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగాన్ని డిజిటల్ పరివర్తనవైపు తీసుకెళ్లే క్షేత్రస్థాయి కార్యాచరణకు ఇప్పటికే పునాది పడింది. 2025 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంపై వెచ్చించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను నిజంగా అందించడానికి 2047 సంవత్సారానికి దాన్ని 5 శాతం పెంచేందుకు తప్పకుండా సన్నద్ధం కావాలి. ► స్వాతంత్య్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మనదేశం గ్లోబల్ ఇన్నో వేషన్ లీడర్ కావాలనేది నా విజన్. ఆరోగ్యరంగం, విద్య, నిలకడైన జీవితాన్ని సమానంగా అందుకుంటూ ఒక సురక్షిత వాతావరణంలో ప్రతి ఒక్కరూ సౌభాగ్యానికి నోచుకునే సమ్మిశ్రితమైన ఆర్థిక వృద్ధిపై దేశం అప్పటికి దృష్టి పెట్టివుంటుంది. మౌలిక భావనలపై మదుపు చేయడం ద్వారా, వ్యవస్థాపకతను ఆర్థిక వృద్ధి నమూనాగా చేయడం ద్వారా భారతదేశం తన పౌరులందరికీ ఉన్నత జీవితానికి హామీ ఇస్తుంది. టెక్నాలజీతో కూడిన పరిశోధన, సృజనాత్మకతలు పెను గంతుతో కూడిన ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. దీనివల్ల 2047 నాటికి భారత్ ప్రపంచంలోని మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలబడటమే కాదు, అభివృద్ధి చెందిన దేశపు హోదాకు దగ్గరవుతుంది. ► కేంద్ర ప్రభుత్వం తన ‘విజన్ ఇండియా 2047’ లక్ష్యసాధన కోసం పరిశోధన, సృజనాత్మకత, టెక్నాలజీలను ప్రధాన చోదక శక్తు లుగా గుర్తించింది. ఈ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ లెక్కన 2047 నాటికి భారత్ ఒక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారు తుంది. స్థానికంగా ఆలోచిస్తూ, విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలిగించే స్టార్టప్, వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తుంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీల నుంచి భారీ పారిశ్రామిక కార్య కలాపాలవైపు ఎదిగేలా ‘టెక్నోప్రెన్యూర్ల’ను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ మార్కెట్లకు భారత సృజనాత్మక భావనలను తీసుకుపోయే అవకాశా లను సృష్టించగలుగుతుంది. 2047 నాటికి గ్లోబల్ ఇన్నో వేషన్ ఇండెక్స్‌లో టాప్ 20 దేశాల్లో భారత్‌ను ఒకటిగా నిలబట్టే లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. ► సరసమైన ధరలకు లభించే ఇంటర్నెట్తో కూడిన డిజిటల్, డేటా మద్దతు కలిగిన సృజనాత్మక ఆలోచనలు భవిష్యత్తులో వేగంగా ఎదిగే డిజటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో తోడ్పడతాయి. భారత్ దేశా నికి ఉన్న శాస్త్రీయ ప్రతిభ ద్వారా ఆరోగ్యరంగంలో ఉత్పాదకతను, నాణ్యతను ప్రోత్సహించగలదు. ఆ విధంగా సరసమైన ధరలకు ఆరోగ్య సేవలను అందించడం, ముందస్తు వ్యాధి నివారక విధానా లను అమలు చేయడం సాధ్యపడటమే కాకుండా, సమగ్ర ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థకు నిజమైన విలువను తీసుకొస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే, వ్యవస్థీకృతంగా, జవాబుదారీ తనంతో ఉండే, సరసమైన ధరలతో, స్వావలంబనతో కూడిన జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించడంలో ఇది తోడ్పడుతుంది. ► భారత్‌లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని డిజిటల్ పరివర్తనవైపు తీసుకెళ్లే క్షేత్రస్థాయి కార్యాచరణకు ఇప్పటికే పునాది పడింది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి క్రమబద్ధీకరణలను మరింత సరళం చేస్తూ కేంద్రప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను మనం అభినందించాలి. అదే సమయంలో, మహమ్మారి వినియోగదారుల ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చింది. డాక్టర్లను ‘టెక్ సావీ’లుగా మార్చడమే కాదు, యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ సొల్యూషన్లపై ఆరోగ్య సంరక్షణ రంగం మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ఈ పరిణామాలన్నీ తక్కువ వ్యయంతో కూడిన, టెక్నాలజీ ఆధారిత సృజనాత్మక ఆవిష్కరణలను సరసమైన ధరలకు అందించే ఒక ఫలప్రదమైన వాతావరణాన్ని కల్పించాయి. ► ఆరోగ్య సంరక్షణ రంగంలో డిజిటల్ చొరబాటుకు సంబంధిం చిన పూర్తి ప్రయోజనాలను అందించేందుకు భారత్ విధానాల రూప కల్పననూ, నిధులనూ ఒక సమన్వయంతో అమలు చేయవలసిన అవసరం ఉంది. 2025 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంపై వెచ్చించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రామాణీకరించబడిన, నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను నిజంగా అందించడానికి 2047 సంవత్సానికి మన జీడీపీలో ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని 5 శాతం పెంచేందుకు భారత్ తప్పకుండా సన్నద్ధం కావాలి. ► భారత ఔషధ పరిశ్రమ ఇప్పటికే ‘ప్రపంచ ఫార్మసీ’గా వెలు గొందుతోంది. ఔషధోత్పత్తి పరిమాణం రీత్యా భారత్ ప్రపంచంలోనే మూడో ర్యాంకులో నిలబడుతోంది. రాగల 25 సంవత్సరాల్లో ఫార్మా స్యూటికల్ వాల్యూ చెయిన్‌లో మరింత వాటాను సంగ్రహించగల గాలి. దీనికోసం, వినూత్నమైన బయోలాజిక్స్, బయోసిమిలర్స్, సెల్, జీన్ థెరపీలు, హై ఎండ్ కాంట్రాక్ట్ రీసెర్చ్ , తయారీ సేవల్లో ఆవిర్భవిస్తున్న అవకాశాలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే ‘ఎంఆర్ఎన్ఏ’తో పాటు ఇతర నూతన తరం టీకాలు, ‘ఆర్ఫన్ డ్రగ్స్’, విలువైన మందులు, మోలిక్యులార్ డయాగ్నసిస్ వంటి అంశాలపై కూడా మనం దృష్టి సారించాల్సి ఉంది. సరైన విధానాలతో భారత ఔషధ పరిశ్రమ ప్రస్తుతం ఉన్న 50 బిలియన్ డాలర్లనుంచి 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఎదిగి, ప్రపంచంలోని టాప్ అయిదు దేశాల సరసన నిలబడుతుంది. ఇక ఔషధోత్పత్తి పరిమాణం రీత్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాం. ► ఫార్మా రంగంలో 500 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని సాధించే రోడ్ మ్యాప్‌లో అధునాతన పరిశోధన, సృజనాత్మకతలను స్వీక రించడం, గ్లోబల్ స్థాయి ఆపరేషన్లను నిర్వహించడం, నాణ్యమైన క్రమబద్ధీకరణ వ్యవస్థను రూపొందించడం ఉంటాయి. పరిశోధనతో సంబంధ ప్రోత్సాహకాలు ఫార్మారంగంలో పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులను పెంచుతాయి. అలాగే మరింత మెరుగైన పరిశ్రమ– అకెడమిక్ భాగస్వామ్యాలను పెంచుతాయి. ► 2047 నాటికి అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా మారడానికి, భారత దేశం తన మహిళా శక్తికి సాధికారత కల్పించాలి. ఒక దేశంగా ఆర్థిక ప్రధాన స్రవంతిలో మహిళలకు అవకాశాలను కల్పించడమే కాకుండా, ఉత్పాదక కృషిలో స్వేచ్ఛగా పనిచేసే వీలు కల్పించాలి. వేతనం లేని శ్రమ శృంఖలాల నుంచి వారిని విముక్తి చేయాల్సి ఉంది. ► భారతదేశ నియత కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 24 శాతంగా మాత్రమే ఉంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇది అత్యంత తక్కువ శాతంగానే చెప్పాలి. అనియత రంగంలో పనిచేస్తున్న భారత మహిళల్లో చాలా మందికి సామాజిక రక్షణ తక్కువ. పైగా వేతనాలు కూడా తక్కువగా ఉంటు న్నాయి. మహిళలను నియత ఆర్థిక వ్యవస్థలోకి పురుషుల భాగ స్వామ్యంతో సమానంగా తీసుకురాగలిగితే, 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మరో 60 శాతం వృద్ధి చెందగలదని అంచనా. అంటే ఆర్థిక వ్యవస్థకు 2.9 ట్రిలియన్ డాలర్ల ఆదాయం జమవుతుంది. రెండంకెల వృద్ధిని సాధించాలంటే, మన ‘టాలెంట్ పూల్’లో సగ భాగంగా ఉన్న మహిళల శక్తిని విస్మరించలేము. విద్య, ఆరోగ్యం, ఆర్థిక భద్రత, ప్రాథమిక హక్కుల వంటి అంశాల్లో మహిళా కేంద్రక కార్యక్రమాలను చేపట్టాలి. 2047 నాటికి నియత రంగంలో 50 శాతం మహిళా భాగస్వామ్యాన్ని తప్పక పెంచాల్సి ఉంటుంది. ► 2047 నాటికి, పునరుద్ధరణీయ శక్తివనరులపై దృష్టి పెట్టాలి. వ్యర్థాలను, ఉద్గారాలను తగ్గిస్తూ, వినిమయ సంస్కృతిని తగ్గించాలి. రీసైకిలింగ్, రీయూజ్ వంటి విధానాలను ప్రవేశ పెట్టాలి. దీనికోసం, భారత్ తన వృద్ధి నమూనాల్లో సంపూర్ణంగా సమగ్ర పర్యావరణ స్వావలంబనను చొప్పించాల్సిన అవసరం ఉంది. ఒక దేశంగా మన విద్యుత్ అవసరాల్లో 80 శాతాన్ని 2047 నాటికి పునర్వినియోగ శక్తి వనరుల ద్వారా తీర్చుకోవడం మన లక్ష్యం కావాలి. పారదర్శకమైన, సమర్థవంతమైన, ఆర్థికంగా సమ్మిశ్రిత రూపంలో ఉండే డిజిటల్ సాధికారిక సమాజాన్ని, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం ద్వారా నూరవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించగలదు. అలాగే నిజమైన గ్లోబల్ శక్తిగా కూడా నిలబడగలదు. కిరణ్ మజుందార్ షా, వ్యాసకర్త ప్రముఖ పారిశ్రామిక వేత్త (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ఈ ముద్దు గుమ్మల పేరిట డబ్బు దాచారు
పనామా: పన్నుపోటులేని స్వర్గసీమగా వాసికెక్కిన పనామాలో వందల కోట్ల రూపాయల నల్లడబ్బును దాచుకున్న వివిధ రంగాల ప్రముఖుల గుట్టురట్టవుతున్న విషయం తెలిసిందే. వీరిలో సినీ నటులు, క్రీడా ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలతోపాటు దేశాధినేతలు కూడా తమ భార్యల పేరిట నల్లడబ్బును దాచుకున్నారు. కొంత మంది ప్రేయసిల పేరిట కూడా డబ్బుదాచారు. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలయేవ్ భార్య షాంపేన్ లవింగ్ సోషలైట్ మెహ్రిబాన్ అలియేవ పేరిట, గినియా అధ్యక్షుడు మమాడి టూర్ భార్య లాన్యానా కాంట్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ భార్య, ప్రొఫెషనల్ ఐస్ డేన్సర్ తతియాన నావ్కా, ఐస్లాండ్ ప్రధాన మంత్రి సిక్ముందర్ డేవిడ్ భార్య అన్నా సికుర్లాగ్ పేరిట కోట్లాది రూపాయల నల్లడబ్బును దాచారు. భార్య నుంచి విడాకులు పొందే సమయంలో ఈ డబ్బు భార్యకు దక్కకుండా భర్త తన పేరు మీదకు మార్చుకునే వెసలుబాటును కూడా న్యాయ సహాయక సంస్థ మొసాక్ ఫోన్సేకా కల్పిస్తోంది. దీనికి చేయాల్సిందల్లా విడాకులు తీసుకోవాలనుకున్న సమయంలో భర్త చిన్న దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రేయసి పేరు మీదున్న సొమ్మును కూడా బదిలీ చేసుకునే అవకాశం ట్రస్టుల ద్వారా కల్పిస్తుండడంతో ఎక్కువ మంది ప్రముఖులు ప్రేయసిల పేరుతో కూడా నల్ల డబ్బు ఖాతాలను తెరిచారు. -
సిరియన్ బాలికలకోసం మలాలా పాఠశాల
లెబనాన్: పాకిస్థాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్.. సిరియన్ శరణార్ధ బాలికల కోసం బెక్కా లోయలో 'మలాలా యూసఫ్ జాయ్ ఆల్ గర్ల్స్ స్కూల్' పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించారు. మలాలా ఫండ్ నిధులను ఈ పాఠశాల నిర్వహణకు ఉపయోగించనున్నారు. తన 18వ పుట్టిన రోజు వేడుకలను ఆమె సిరియన్ సరిహద్దుల్లో లెబనాన్ వ్యాలీలో ఆదివారం జరుపుకొన్నారు. బాలికా విద్యకోసం పాటు పడుతున్నమలాలా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విద్యకు అధిక ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. మిలిటరీ ఖర్చులను తగ్గించుకొని , బాలికా విద్యాకోసం పాటుపడాలని ప్రపంచ నాయకులకు విజ్క్షప్తి చేశారు. ప్రపంచం మొత్తంమీద ఎనిమిది రోజులు సైనిక ఖర్చును నిలిపివేస్తే 12 సంవత్సరాలపాటు ఉచిత విద్యను అందించవచ్చన్నారు. ప్రతీ పిల్లవాడికి నాణ్యమైన విద్య చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. సిరియాలో తలెత్తిన అంతర్యుద్ధాన్ని నివారించడంలో ప్రపంచ దేశాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. సిరియా ప్రాంతంలో అంతర్యుద్ధం కారణంగా ప్రజలు చెల్లాచెదరైపోతున్నారనీ, ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా మారిపోతున్నారన్నారు. ఆ ప్రజలను, ముఖ్యంగా పిల్లలను కాపాడడంలో ప్రపంచ దేశాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇది హృదయాలను పిండేసేంత బాధాకరమైన విషయమన్నారు. సిరియన్ శరణార్థ బాలికలకు తన సంపూర్ణ మద్దతు తెలియచేసిన ఆమె ఇంతమంది ధైర్యవంతుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అరుదైన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఇంత విషాదకర పరిస్థితుల్లోనూ, అంతర్యుర్ధం మధ్య పాఠశాలకు వెళుతున్న 2.80 కోట్ల మంది పిల్లల ప్రతినిధిగా ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయని మలాలా కొనియాడారు.