ఏడు కోట్ల విలువైన డైమండ్‌ రింగ్‌ మాయం.. తీరా చూస్తే..  | Paris Hotel Finds Customer Missing Diamond Ring In Vacuum Cleaner Bag | Sakshi
Sakshi News home page

ఏడు కోట్ల విలువైన డైమండ్‌ రింగ్‌ మాయం.. తీరా చూస్తే.. 

Dec 12 2023 10:24 AM | Updated on Dec 17 2023 7:02 PM

Paris Hotel Finds Customer Missing Diamond Ring In Vacuum Cleaner Bag - Sakshi

లగ్జరీ హోటల్‌కు వెళ్లిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఏడు కోట్ల రూపాయల విలువైన డైమండ్‌ రింగ్‌ కనిపించకపోవడంతో సదరు మహిళ ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో హోటల్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతలో పోగొట్టుకున్న రింగ్‌ ఆమె తప్పిదం వల్లే మరో చోట దొరకడంతో ఖంగుతుంది. ఈ ఘటన ప్యారిస్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ప్యారిస్‌లోని ‍ప్రఖ్యాత హోటల్‌ రిట్జ్‌లో బస చేసిన ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంకేముంది. ఆ మహిళ ఆరునొక్క రాగం అందుకుంది. హోటల్‌ సిబ్బందిపై చిర్రుబుర్రులాడింది. పాపం హోటల్‌ వాళ్లు కూడా ప్రతిష్టకు పోయారు. ఇంతపెద్ద హోటల్‌లో అంత విలువైన ఆభరణం చోరీ అవడమేమిటి? ఠాట్‌! అనుకున్నారేమో... హోటల్‌ మొత్తం వెతకడం మొదలు పెట్టారు. ప్రతివ్యక్తినీ అనుమానించారు. శోధించారు.

బ్యాగేజీ.. ఫర్నీచర్‌.. బీరువాలు.. లాకర్లు.. ఇలా సిబ్బంది వెతకని చోటంటూ లేకపోయింది. అంత చేసినా ఆ ఉంగరం దొరికిందా? ఊహూ లేదు! ఇక మా వల్ల కాదని సిబ్బంది కూడా చేతులెత్తేస్తున్న సమయంలో సిబ్బందిలో ఒకరు.. ‘దొరికింది’ అని గాట్ఠిగా అరవడం వినిపించింది. ఎక్కడో తెలుసా?.. వాక్యూమ్‌ క్లీనర్‌ బ్యాగ్‌లో!. అంటే.. ఆ మహిళ దాన్ని గదిలో ఎక్కడో పడేసుకుంటే.. కార్పెట్‌ను క్లీన్‌ చేస్తుండగా వాక్యూమ్‌ క్లీనర్‌ ద్వారా లోపలికి చేరిపోయిందన్నమాట!. ఇక, విలువైన డైమండ్‌ రింగ్‌ దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఆమెను మలేషియాకు చెందిన మహిళగా గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement