‘పాక్‌లో హైటెన్షన్‌.. బీజేపీ, ఆరెస్సెస్‌ల పనేనంట!’ | Sakshi
Sakshi News home page

‘అల్లర్ల వెనుక ఉంది బీజేపీ, ఆరెస్సెస్‌లే!’..విధ్వంసకాండపై పాక్‌ వింత వాదన

Published Wed, May 10 2023 9:13 PM

Pakistan bizarre claim On Ongoing Clashes Says RSS BJP Behind It - Sakshi

ఇస్లామాబాద్‌:  మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌తో పాకిస్తాన్‌ ఒక్కసారిగా అగ్ని గుండంగా మారింది. ఖాన్‌ అరెస్ట్‌ను ఖండిస్తూ ఆందోళన చేపట్టిన..  పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కార్యకర్తలు విధ్వంసకాండకు తెగబడ్డారు. మంగళవారం సాయంత్రం మొదలైన ఈ పర్వం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టంవైపు అడుగులేస్తోంది పీటీఐ శ్రేణుల ఆందోళన.  అయితే ఈ హింసపై పాక్‌ అధికారిక వర్గాలు మాత్రం వింత వాదనకు దిగాయి. 

పాక్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులకు.. పీటీఐ కార్యకర్తలు కారణం కాదంట. ఆ కల్లోలం వెనుక భారత్‌లోని బీజేపీ, ఆరెస్సెస్‌ ఉందంటూ వాదిస్తోంది. పాక్‌ ప్రధాని షెహ్‌బాష్‌ షరీఫ్‌ వ్యక్తిగత కార్యదర్శి అట్టా తరార్‌  ఈ విచిత్రమైన వాదనను లెవనెత్తాడు. పాక్‌లో విధ్వంసకాండకు, అల్లర్లకు కారణం ఇక్కడి వాళ్లు కారు. భారత్‌ నుంచి ఆరెస్సెస్‌, బీజేపీలు అందుకోసం అక్కడి నుంచి కిరాయి మనుషుల్ని పాక్‌కు పంపారు అంటూ బుధవారం మీడియా ముందు పేర్కొన్నాడు తరార్‌.

నిరసనల పేరిట విధ్వంసానికి దిగిన వాళ్లు బీజేపీ, ఆరెస్సెస్‌ మనుషులే. అంతెందుకు వాళ్లు నిన్నటి (మంగళవారం ఖాన్‌ అరెస్ట్‌.. తదనంతరం అల్లర్లు) పరిణామం తర్వాత భారత్‌లో సంబురాలు కూడా చేసుకున్నారు. ఇదంతా ఆరెస్సెస్‌ ఆదేశాలతో జరిగింది’ అని తరార్‌ పాక్‌ మీడియా ఎదుట ప్రకటన చేశాడు. 

ఇదీ చదవండి: బాత్రూంకు కూడా పోనివ్వకుండా టార్చర్‌ పెట్టారు!

Advertisement
 
Advertisement
 
Advertisement