సమాధానం చెప్పాల్సిన పని లేదు: చోటా షకీల్‌ | Sakshi
Sakshi News home page

సమాధానం చెప్పాల్సిన పని లేదు: చోటా షకీల్‌

Published Wed, Aug 26 2020 6:14 PM

Not Answerable to Any Government Chhota Shakeel  - Sakshi

ఇస్లాంబాద్‌: అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కరాచీలో నివసిస్తున్నాడన్న వార్తలను పాకిస్తాన్‌ ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను దావూద్‌ ప్రధాన అనుచరుడు చోటా షకీల్‌ బుధవారం ఖండించారు. కరాచీలో ఒక ఖరీదైన భవనంలో ఉన్నాడని  భారత మీడియా చూపించిందని ఈ విషయంలో పూర్తి బాధ్యత దానిదే అని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో సహా తాము ఏ ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు. 

సోషల్‌ మీడియాలో అనేక కథనాలు వస్తూ ఉంటాయని, వాటన్నింటికి తాము బాధ్యత వహించబోమని తెలిపాడు. సామాజిక మాధ్యమాలలో విలువైన బంగ్లాలలో ఉంటూ, ఖరీదైన కార్లలలో తిరుగుతారని ఏవేవో రాస్తారని వాటన్నింటికి మేం ఎలా బాధ్యత వహిస్తామని చోటా షకిల్‌ ప్రశ్నించాడు. 1993 ముంబై పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడైన దావూద్‌ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయి పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్‌ చాలా సంవత్సరాల పాటు ఖండించింది. దావూద్‌ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నట్లు పాక్‌ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.  

చదవండి: పాక్‌లోనే దావూద్‌..!

Advertisement
Advertisement