ఉ‍త్తర కొరియా క్షిపణులను పరీక్షించేది అందుకేనా | North Korea Test Fires Missiles In First Overt Challenge To Biden Administration | Sakshi
Sakshi News home page

‌ ఉత్తర కొరియా తన కవ్వింపు చర్యలు మొదలుపెట్టిందా ?

Mar 24 2021 11:26 AM | Updated on Mar 24 2021 12:13 PM

North Korea Test Fires Missiles In First Overt Challenge To Biden Administration - Sakshi

ఈ పరిణామాలను చూస్తుంటే  ప్యాంగ్‌యాంగ్‌ తరుపున నుంచి  బిడెన్‌ ప్రభుత్వానికి  ఎదురుకాబోయే మొదటి సవాలు ఇదేనని తెలుస్తోంది.

వాషింగ్టన్‌: అమెరికా రక్షణ, దౌత్యాధికారులు ఉత్తర కొరియాను సందర్శించిన కొద్ది రోజులకే ఉ.కొ అనేక క్షిపణులను పరీక్షించిందని మంగళవారం వైట్ హౌస్ తెలిపింది. ఆదివారం రెండు క్షిపణులను పరీక్షించడం ద్వారా వాషింగ్టన్ ,సియోల్ను రెచ్చగొట్టడానికి ప్యాంగ్‌యాంగ్‌ మళ్లీ తన పాత పద్ధతులను అనుసరిస్తోందని తెలుస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే  ప్యాంగ్‌యాంగ్‌ వైపునుంచి బిడెన్‌ ప్రభుత్వానికి  ఎదురుకాబోయే మొదటి సవాలు ఇదేనని తెలుస్తోంది. అయితే, దీనిపై అమెరికా పరిపాలనా అధికారులు మాట్లాడుతూ.. క్షిపణుల పరీక్ష "సాధారణ" సైనిక పరీక్షే అని అన్నారు. అలాగే అణ్వాయుధీకరణపై ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపుతున్న వాషింగ్టన్‌కు ఈ చర్యలు అడ్డు కావని తెలిపారు. అవి తక్కువ రెంజ్‌ కలిగిన, నాన్‌ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు అని, అలాగే ఈ క్షిపణిలు ఏవీ కూడా యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు నిరోధించిన పరిధిలోకి రావని అమెరికా పరిపాలన సీనియర్ అధికారి విలేకరులతో అన్నారు.

గత అమెరికా ప్రభుత్వాలను రెచ్చగొట్టడానికి అప్పట్లో ప్యాంగ్‌యాంగ్‌ ప్రయోగించిన అణ్వాయుధ పరీక్షలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు వంటివి ఏవీ ఇందులో లేవన్నారు. ప్రస్తుతం పరీక్షించిన ఈ క్షిపణులు ఆ కోవలోకి రావని తెలిపారు. ఉత్తర కొరియా తమ వివిధ వ్యవస్థలను పరీక్షించడంలో భాగంగా ఇలాంటివి చేయటం అక్కడ సర్వ సాధారణమని, తాము ప్రతి రకమైన పరీక్షకు స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ( చదవండి : ఈ నాలుగేళ్లు ప్రశాంతంగా నిద్ర పోవాలంటే.. )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement