మిసైల్‌ దూకుడు పెంచిన ఉత్తరకొరియా.. షాక్‌లో యూఎస్‌, దక్షిణ కొరియా

North Korea Fired Unidentified Ballistic Missile Seouls Military Said - Sakshi

సియోల్‌: ఉత్తర కొరియా ఒక అనుమానాస్పద క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియ బలగాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం యూఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌ దక్షిణ కొరియా పర్యటనకు ముందు రోజే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఈ విషయాన్ని జపాన్‌ కోస్ట్‌ గార్డు కూడా ధృవీకరించిందని టోక్యో రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.

అంతేగాక ఈ విషయమై తమ జపాన్‌ కోస్ట్‌ గార్డు తీరంలో ఉన్న నౌకలకు హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా జపాన్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ కొరియా ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం నిర్వహించనుందని హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగానికి తెగబడటం గమనార్హం. ఇదిలా ఉండగా..అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ గురువారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ చేరుకోనున్నారు.

ఈ పర్యటన సందర్భంగా ఆమె ఉత్తర దక్షిణ కొరియాల సరిహద్దు పటిష్ట భద్రతను పర్యవేక్షించనున్నారు. ఈ వారంలోనే ఈ రెండు దేశాలు రోనాల్డ్‌ రీగన్‌ సముద్రతీర ప్రాంతంలో సంయుక్తంగా సైనిక కసరత్తులను నిర్వహించనున్నాయి. ఐతే ఉ‍త్తర కొరియా ఈ ఇరు దేశాల సైనిక కసరత్తులను యుద్ధ సన్నహాలుగా పరిగణిస్తూ ఫైర్‌ అవుతోంది. ఐతే ఆయా దేశాలు మాత్రం తమ భద్రతా దృష్ట్యా సాగిస్తున్న విన్యాసాలుగా చెబుతున్నాయి. అదీగాక అమెరికా దక్షిణ కొరియా రక్షణ నిమిత్తం దాదాపు 28 వేల సైనికులను మోహరించింది.

(చదవండి: చైనా మాస్టర్ ప్లాన్‌.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top