భారత్‌ అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా వృద్ధి చెందుతుంది: మోదీ

New York: PM Narendra Modi Speech At UNGA Summit - Sakshi

న్యూయార్క్‌: న్యూయార్క్ వేదికగా శనివారం సాయంత్రం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...భారత్‌ వృద్ధి చెందితే, ప్రపంచం కూడా వృద్ధి చెందుతుందనే విషయాన్ని నొక్కి చెప్పారు.

భారత్‌లో ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రపంచాన్నే మారుస్తున్నాయని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన అభివృద్ధి అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ మా నినాదమని చెప్పారు. వ్యక్తి ప్రయోజనం కంటే సమాజ ప్రయోజనమే ముఖ్యమని, దేశంలో 36 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించామన్నారు. 

మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • ఏడాది కాలంగా ప్రపంచం సంక్షోభంలో చిక్కుకుంది
  • మా దేశంలో  వైవిధ్యమే ప్రజాస్వామ్యాన్ని బలంగా మార్చింది
  • వందేళ్లలో ఎప్పుడూ చూడని కరోనా కష్టకాలాన్ని చూశాం
  • గత ఏడేళ్లలో 43 కోట్ల మందిని బ్యాంకింగ్‌ వ్యవస్థతో అనుసంధానించాం
  • కోట్ల మందికి సురక్షిత ఆరోగ్య సదుపాయాలు కల్పించాం
  • కలుషిత నీరు ప్రపంచం మొత్తానికి పెద్ద సమస్య
  • 17 కోట్ల మందికి సురక్షిత మంచినీటిని అందించగలిగాం
  • కరోనా సమయంలో 3 కోట్ల మందికి ఇళ్లు కట్టించాం
  • సమ్మిళిత అభివృద్ధి వైపు భారత్‌ నడుస్తోంది.
  • ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయగలిగాం
  • ముక్కుద్వారా ఇచ్చే టీకాను త్వరలో తీసుకొస్తాం
  • ఎమ్‌ఆర్‌ఎన్‌ఏ టీకా తయారీ చివరి దశలో ఉంది
  • 12 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే డీఎన్‌ఏ టీకాను తయారు చేస్తున్నాం
  • వందేళ్లలో చూడని విపత్తును కరోనాతో చూశాం
  • ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నది భారత్‌ విధానం
  • భారత్‌లో వేల ఏళ్లుగా ప్రజాస్వామ్యం కొనసాగుతోంది
  • ప్రజాస్వామ్య పాలనలో అన్ని లక్ష్యాలను చేరుకుంటున్నాం
  • భారత్‌ ప్రజాస్వామ్య ప్రకాశానికి ఒక ఉదాహరణ

చదవండి: Immediately vacate Pak: పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన స్నేహ దూబే.. అసలు ఎవరామే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top