Immediately vacate Pak: పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన స్నేహ దూబే.. అసలు ఎవరామే!

Pakistan To Immediately Vacate All Areas Under Its Illegal Occupation In India - Sakshi

న్యూయార్క్‌: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఐక్య రాజ్య సమితి 76వ జనరల్‌ అంసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశంలో భారత్‌పై మళ్లీ తన అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ప్రధాని సమావేశంలో కశ్మీర్‌ సమస్యను లేవనెత్తి భారత్‌పై ద్వేషపూరిత ఆరోపణలు చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. అంతేకాదు ఈ సమావేశంలో ప్రపంచ దృష్టిని మరల్చేలా భారత్‌పై బురద జల్లే  ప్రయత్నం చేశారు. దీంతో భారత ప్రతినిధి స్నేహ దూబే పాక్‌ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ మేరకు  భారత్‌ ప్రతినిధి స్నేహ దూబే మాట్లాడుతూ...." జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లోని అంతర్భాగమని, వాటిని ఎన్నటికీ భారత్‌ నుంచి విడదీయలేరు. పాకిస్తాన్‌ చట్ట విరుద్ధంగా ఆక్రమించి స్థావరాలు ఏర్పాటు చేసుకున్న భారతదేశానికి చెందిన ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయండి." అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక పాక్ ప్రధాని కుదిరినప్పుడుల్లా పొరుగు దేశమైన భారత్‌పై కయ్యానికి కాలుదువ్వడమే పనిగా పెట్టుకుంటారంటూ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, స్వేచ్ఛగా తిరిగేలా పాస్‌పోర్ట్‌లు కూడా మంజూరు చేసిన గొప్ప దేశం అంటూ విమర్శించారు. ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి ఆర్థిక సహయం అందిస్తున్న చారిత్రాత్మక దేశంగా ప్రపంచ దేశాలకు తెలుపంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.

(చదవండి: అపహరణకు గురైన ఇరాక్‌ పురాతన శాసనాన్ని తిరిగి ఇ‍చ్చేశాం!)

ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి జోక్యం చేసుకుంటూ ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనివ్వకుండా భారత్‌దేశ సమస్యలు గురించి ఎందుకంటూ  ఘాటుగా విమర్శించారు. ఉగ్రవాదులకు సహాయసహకారాలు అందించే విషయాలు, తాలిబన్‌ ఆక్రమిత అఫ్గనిస్తాన్‌ వంటి వాటిల్లో పాక్‌ కీలక పాత్ర గురించి క్వాడ్‌ లేదా మరే ఏ ఇతర సదస్సుల్లో అయిన ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలని చెప్పారు. 

స్నేహ దూబే వివరాలు
దీంతో పాకిస్తాన్‌కు ధీటుగా బదులిచ్చిన స్నేహ దూబే గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చ మొదలైంది. అసలు ఇంతకీ ఎవరామే అంటే ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. స్నేహ దూబే ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె తండ్రి వ్యాపార వేత్త, తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు. చిన్న వయసు నుంచే స్నేహ దూబే దేశానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు. గోవాలో పాఠశాల చదువును పూర్తి చేశారు, పూణెలో కళాశాల విద్య, ఆతర్వాత దిల్లీ జేఎన్‌యూ నుంచి ఎంఫిల్‌ పట్టా పొందారు. 2012 బ్యాచ్‌కు చెందిన దూబే మొదటి పోస్టు విదేశాంగ శాఖలో తరువాత 2014లో స్పెయిన్‌లోని భారత దౌత్య కార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

(చదవండి: ఇది మా గగన విహారం మీరు ఎగరడానికి వీల్లేదు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top