టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో పాపులర్‌టీవీ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' షోలో 'వాల్టర్ వైట్ జూనియర్' (Walter White Jr.) నటుడు ఆర్.జె. మిట్టే ఆకస్మికమరణం ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి రేపింది. కేవలం 34 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన మిట్టే మరణ వార్త షో అభిమానులందరూ తీవ్ర విషాదాన్ని నింపింది. 'బ్రేకింగ్ బ్యాడ్' సహనటులతో పాటు పలువురు మిట్టే అకాల మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మిట్టేకు రీల్ తండ్రిగా నటించిన హాలీవుడ్ స్టార్ బ్రయాన్ క్రాన్‌స్టన్ (Bryan Cranston) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
'బ్రేకింగ్ బ్యాడ్'లో నా ముద్దుల కొడుకు RJ మిట్టే ఇకలేరు" అంటూ బ్రయాన్ క్రాన్‌స్టన్ ఆర్జే మిట్టేతో దిగిన ఒక పాత చిత్రాన్ని షేర్ చేస్తూ ఎమోషనల్ నివాళి అర్పించారు. 14 ఏళ్ల టీనేజర్‌గా ఉన్నప్పుడు 'వాల్టర్ వైట్ జూనియర్' పాత్ర కోసం మిట్టే పరిచయమయ్యారని, ఆ పాత్రను ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా పోషించారని, దివ్యాంగత్వాన్ని జయించిన ధీరుడు అని గుర్తు చేసుకున్నారు.
🕊️ "Breaking Bad" star RJ Mitte has died at 34. https://t.co/bczQRoJBeV
— Snoopy fans (@snoopy1060605) October 13, 2026
పుట్టుకతోనే 'సెరెబ్రల్ పాల్సీ' (Cerebral Palsy) వ్యాధితో బాధపడుతున్న మిట్టే, తన జీవిత అనుభవాలను షోలోని పాత్రకు ప్రతిబింబించేలా చేశారు. ఆ ఆరోగ్య సమస్యను తన ఆశయాలకు ఎప్పుడూ అడ్డురానివ్వలేదని క్రాన్‌స్టన్ ప్రశంసించారు. తన సమస్యను దేనికీ సాకుగా చూపించకుండా, ఎంతో పట్టుదలతో కఠినమైన షూటింగ్ షెడ్యూళ్లను పూర్తిచేశారు. టీవీ తల్లిదండ్రులుగా తామిచ్చిన సలహాలను ఎప్పుడూ వినేవారని, సూపర్ హిట్ టీవీ షోలో ప్రధాన నటుడైనప్పటికీ, ఆయన మనసు మాత్రం ఒక చిన్నపిల్లాడిలాగే ఉండేదంటూ కొనియాడారు.మిట్టే నటుడిగానే కాకుండా దివ్యాంగుల హక్కుల కోసం బలమైన గొంతుకగా ఎదగడం చూసి ఎంతో గర్వపడ్డామని గుర్తు చేసుకున్నారు. 
అంతేకాదు కలిసి లంచ్ చేద్దామనుకున్నాం.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. షో చేస్తున్న సమయంలోనూ, ఆ తర్వాత కూడా ఆయనతో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను "ఐ విల్ మిస్ యూ, సన్ " అని పోస్ట్ చేశారు. అలాగే మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న వారు వెంటనే హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని క్రాన్స్టన్ విజ్ఞప్తి చేశారు.

ఎవరీ ఆర్.జె. మిట్టే
'బ్రేకింగ్ బ్యాడ్' (Breaking Bad) ఫేమ్ నటుడు RJ మిట్టే బ్రేకింగ్ బాడ్ పాత్రలాగానే పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ ఉంది. కొన్ని రోజుల ముందు కూడా తన రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి ఉత్సాహంగా మాట్లాడిన, మిట్టే ఆత్మహత్య అభిమానులకు, సహ నటులను షాక్‌లో ముంచేసింది. తన పాత్ర ద్వారా ఈ వైకల్యంపై అవగాహనకల్పించడంతోపాటు దానికోసం ఒక వేదికను తీసుకొచ్చారు. 2008 -2013 వరకు 'బ్రేకింగ్ బ్యాడ్' 5 సీజన్లలో (2008–2013) మిట్టే 'వాల్టర్ వైట్ జూనియర్' (ఫ్లిన్) పాత్రను పోషించారు. షో ముగిసిన తర్వాత కూడా ఆయన నటనా రంగాన్ని కొనసాగిస్తూనే, దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించడంపై విస్తృతంగా కృషి చేశారు.'డిక్సీలాండ్', 'హూస్ డ్రైవింగ్ డగ్', 'ది రికాల్', 'మోవర్ బాయ్', 'టైమ్ షేర్', మరియు 'ది ఓక్ రూమ్', 'టాకింగ్ టు స్ట్రేంజర్స్' (Talking to Strangers) ప్రీమియర్ సందర్భంగా, సెప్టెంబర్ 30న బెవర్లీ హిల్స్‌లోని ఫైన్ ఆర్ట్స్ థియేటర్‌లో రెడ్ కార్పెట్‌పై తన చివరిగా కనిపించారు.
ఇదీ చదవండి: రూ. 1500 కోట్ల సామ్రాజ్యం : అప్పట్లో ఆలూ, ఉల్లి, మరిప్పుడు?


