మస్క్, అమెరికా ఆర్థిక మంత్రి కొట్టుకున్నారు!  | Musk brawled with US treasury secretary | Sakshi
Sakshi News home page

మస్క్, అమెరికా ఆర్థిక మంత్రి కొట్టుకున్నారు! 

Jun 9 2025 5:20 AM | Updated on Jun 9 2025 5:20 AM

Musk brawled with US treasury secretary

మంత్రినే వెనకేసుకొచ్చిన ట్రంప్‌! 

అక్కడినుంచే విభేదాలు 

వైట్‌హౌస్‌ వర్గాల వెల్లడి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్‌ ట్రంప్, లక్షల కోట్లకు అధిపతి ఎలాన్‌ మస్క్‌ మధ్య మాటల మంటలకు మూలకారణమైన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. వారి మధ్య సఖ్యత చెడటానికి ఆర్థిక మంత్రి స్కాట్‌ బిసెంట్‌ కారణంగా మారినట్టు ట్రంప్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత ఏప్రిల్‌లో అధ్యక్ష కార్యాలయంలోని ఓవల్‌ ఆఫీస్‌లో భేటీ తర్వాత మస్క్‌, బిసెంట్‌ బాహాబాహీకి దిగారట! ట్రంప్‌ సన్నిహితుడు, పాడ్‌కాస్టర్‌ స్టీఫెన్‌ కె.బ్యానన్‌ ఈ మేరకు బయటపెట్టారు.

 వేలాది మంది ఫెడరల్‌ ఉద్యోగులను తొలగిస్తూ, వాళ్ల జీతభత్యాలను ట్రంప్‌ సర్కార్‌కు ఆదా చేస్తూ, లక్షల కోట్ల విదేశీ నిధులను నిలిపివేస్తూ ఆర్థిక శాఖపై తాను భారం తగ్గిస్తుంటే ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ పేరిట పన్నులను తగ్గించి ఆర్థిక శాఖపై అధ్యక్షుడు భారం పెంచుతున్నారంటూ మస్క్‌ తీవ్రంగా ఆక్షేపించడం తెలిసిందే. బిసెంట్‌తో ముష్టిఘాతాల పర్వం వారి మధ్య దూరాన్ని బాగా పెంచేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఓవల్‌ ఆఫీస్‌లో ఏం జరిగింది? 
ఏప్రిల్‌ నెల మూడోవారంలో ఓవల్‌ కార్యాలయంలో ట్రంప్‌తో భేటీ సందర్భంగా అంతర్గత రెవెన్యూ విభాగ కమిషనర్‌గా మస్క్‌, బిసెంట్‌ చెరో పేరు ప్రతిపాదించారు. బిసెంట్‌ సూచించిన అభ్యర్థి వైపు ట్రంప్‌ మొగ్గా రు. అవమానభారంతో వెళ్లిపోతున్న మస్క్‌తో బిసెంట్‌ వాగ్వాదానికి దిగారు. అది కాస్తా కొట్లాటకు దారితీసింది. ‘రగ్బీ’ మ్యాచ్‌ తరహాలో బిసెంట్‌ను మస్క్‌ తన భుజంతో ఎత్తి కుదేశాడు. ఇద్దరూ కొట్టుకుంటుండటంతో సిబ్బంది నిలువరించారు. ఇది ట్రంప్‌కు తెలియడంతో ‘మరీ ఓవర్‌గా ఉంది’ అన్నారు. అనంతరం మీడియా భేటీ సందర్భంగా మస్క్‌ ముఖం వాచిపోయి, కళ్లు ఎర్రబారడం కన్పించింది. కొడుకుతో ఆడుతుంటే దెబ్బలు తగిలాయని మస్క్‌ అప్పట్లో కవర్‌ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement