సూట్‌కేసు, బ్యాగు మధ్యలో పులి పిల్ల.. కారు డిక్కీ ఓపెన్ చేసిన పోలీసులు షాక్..

కారు చేస్ చేసి ఆపిన పోలీసులు.. డిక్కీలో పులి పిల్లను చూసి షాక్.. - Sakshi

మెక్సికో సిటీ: పోలీసులు రోడ్డుపై సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారు వచ్చింది. వీళ్లను చూసి ఆపకుండా అది అలానే ముందుకుపోయిది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ వాహనంతో వెంబడించి ఆపారు. అనంతరం కారు డిక్కీ ఒపెన్ చేసి చూసి షాక్ అయ్యారు.  డిక్కీలో సూట్‌కేస్, బ్యాగుల మధ్యన పులిపిల్లను చూసి అవాక్కయ్యారు.

కారు డిక్కీలో పులి పిల్లతో పాటు తుపాకులు, బుల్లెట్లు కూడా ఉన్నాయి. దీంతో వెంటనే కారులోని దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ పులి పిల్లను   వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

మెక్సికోలో డ్రగ్ ట్రాఫికర్లకు పులులు పెంచుకోవడం అంటే సరదా. అక్రమంగా వాటిని కొనగోలు చేసి పెంపుడు జంతువుల్లా ఇళ్లలో పెంచుకుంటారు. అయితే పులులు, సింహాలను పెంచుకోవడం అక్కడ నేరమేమీ కాదు. కాకపోతే అధికారిక డీలర్లు, బందిఖానాలో జన్మించిన వాటిని మాత్రమే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది.

2020లోనూ రోడ్డుపై తిరిగుతున్న ఓ  బెంగాల్ టైగర్‌ను పోలీసులు సీజ్ చేశారు. 2019లో ఓ ఇంట్లో సింహాలను స్వాధీనం చేసుకున్నారు. సింహాల గర్జనకు బెంబేలెత్తిపోయిన పొరుగింటివారు ఫోన్ చేయడంతో అక్కడకు వెళ్లి వాటిని తరలించారు.
చదవండి: Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్..

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top