దేశాధ్యక్షురాలిపై లైంగిక వేధింపులు.. | Mexico President Claudia Sheinbaum Faces Harassment During Public Event | Sakshi
Sakshi News home page

దేశాధ్యక్షురాలిపై లైంగిక వేధింపులు..

Nov 5 2025 7:16 PM | Updated on Nov 5 2025 8:20 PM

Man Gropes and tries to Kiss Mexico President Claudia Sheinbaum

మెక్సికో: ఆమె సాదాసీదా మహిళకాదు. సాక్షాత్తూ ఓ దేశాధ్యక్షురాలు. అయినా ఆమెపైనే లైంగిక వేధింపులు ఆగలేదు. ప్రజలతో కరచాలనం చేస్తుండగా.. అగంతకుడు వెనక నుంచి  ఆమెపై చేతులు వేసి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్‌తో కంగుతిన్న దేశాధ్యక్షురాలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ‘డోంట్‌ వర్రీ’ అంటూ.. నిందితుడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న తన వ్యక్తిగత సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  

ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే? మిచోకాన్ రాష్ట్రం ఉరుఆపాన్ పట్టణ మేయర్ కార్లోస్ మాంజో రోడ్రిగెజ్ డే ఆఫ్ ది డెడ్ వేడుకల సమయంలో పబ్లిక్ ప్లాజాలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు రోడ్ల మీదకు వచ్చారు. ప్రజలకు రక్షణ కల్పించలేదని అసమర్ధపు ప్రభుత్వం అంటూ ఆందోళన చేపట్టారు. 

ఆందోళన కారుల్ని శాంతింపజేసి, తగు రక్షణ చర్యలు చేపట్టేందుకు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ మంగళవారం మిచోకాన్‌ రాష్ట్రంలో బహిరంగంగా పర్యటించారు. మెక్సికో సిటీ కేంద్రంలో ప్రజలతో  కరచాలనం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను వెనుక నుంచి పట్టుకుని ముద్దుపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 

ఈ ఊహించని పరిణామంపై అధ్యక్షురాలు కూల్‌గా హ్యాండిల్‌ చేశారు. అతన్ని పక్కకి తోసేస్తూ డోండ్‌ వర్రీ అంటూ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అలెర్ట్‌ చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుణ్ని వెనక్కి లాగారు. ఈ ఘటన ప్రెసిడెన్షియల్ గార్డ్ లేకపోవడం వల్ల భద్రతా లోపాలు ఉన్నాయన్న విమర్శలకు దారితీసింది. 

గడిచిన మూడేళ్లలో మెక్సికోలో ఆరుగురు మేయర్‌లు దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా మిచోకాన్ రాష్ట్రం ఉరుఆపాన్ పట్టణ మేయర్ కార్లోస్ మాంజో రోడ్రిగెజ్ డే ఆఫ్ ది డెడ్ వేడుకల సమయంలో పబ్లిక్ ప్లాజాలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ప్రధాన కారణం మేయర్‌ కార్లోస్‌ దేశంలో మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టాలని పలు మార్లు నినదించారు. అందుకే నిందితులు కార్లోస్‌ను హత మార్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు బహిరంగంగా పర్యటించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement