షాకింగ్‌ ఘటన: ఏకంగా 45 బ్యాగుల్లో మానవ అవశేషాలు!

At Least 45 Bags With Human Body Parts Found In Western Mexican City - Sakshi

అమెరికాలోని పశ్చిమ మెక్సికో రాష్ట్రంలో ఒళ్లు గగ్గుర్పొడిచే భయానక షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు జాలిస్కోలోని ఓ లోయలో మానవ శరీర భాగాలతో కూడిన దాదాపు 45 బ్యాగులు లభించాయని అధికారులు తెలిపారు. అందులో స్త్రీ, పురుషులకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద పారిశ్రామిక కేంద్రమైన గ్వాడలజారా శివారు ప్రాంతమైన జపోపాన్‌ మున్సిపాలిటీ వద్ద ఓ 40 మీటర్ల లోయలో ఈ భయానక ఘటన వెలుగు చూసిందని తెలిపారు.  

30 ఏళ్ల వయసుగల ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు తప్పిపోయినట్లు ఫిర్యాదు రావడంతో వారి ఆచూకి కోసం వెతుకుతుండగా..ఈ ఘటన బయటపడింది. ఆయా వ్యక్తుల మిస్సింగ్‌ కేసులు వేర్వేరు రోజుల్లో వేర్వేరుగా అందినట్లు చెప్పుకొచ్చారు. అయితే వారందరూ ఒకే కాల్‌ సెంటర్‌లో పనిచేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతంలోనే కాల్‌సెంటర్‌ కూడా ఉంది.

పోరెన్సిక్‌ నిపుణులు భాదితులు సంఖ్య, గుర్తింపును వెల్లడించాల్సి ఉంది. కాల్‌ సెంటర్‌లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరిగి ఉండవచ్చిని అనుమానిస్తున్నారు. ఆ కాల్‌ సెటర్‌ వద్ద మాదక ద్రవ్యాలు, రక్తపు మరకలతో కూడిన వస్తువులు, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు లభించినట్లు తెలిపారు. ఐతే బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం వారిని నేరస్తులుగా చిత్రీకరించేందుకు యత్రిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా, జాలిస్కాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తొలిసారి కాదు. 2021లో, జాలిస్కోలోని తోనాలా మునిసిపాలిటీలో, 11 మంది మానవ అవశేషాలతో 70 బ్యాగులు బయటపడ్డాయి.

అంతకుమునుపు 2019లో జపోపాన్‌లోని జనావాసాలు లేని ప్రాంతంలో 119 బ్యాగుల్లో 29 మంది మానవ అవశేషాలను కనుగొన్నారు. కానీ 2018లో ముగ్గురు చలన చిత్ర విద్యార్థులు మిస్సింగ్‌ కేసులో.. వారి అవశేషాలు యాసిడ్‌లో కరిగిపోవడం అత్యంత వివాదాస్పదంగా మారి నిరసనలకు దారితీసింది. 

(చదవండి: ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నిరసిస్తూ.. నగ్నంగా నిలబడి..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top