అమెరికా: కమల హారిస్‌, మైక్‌ పెన్స్‌ ముఖాముఖి

Kamala Harris And Mike Pence Debate In America - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల‌ ముఖాముఖి సాల్ట్‌లేక్‌లోని కింగ్స్‌ బర్రీహాల్‌లో ప్రారంభమైంది. కోవిడ్‌ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య గ్లాస్‌ మాస్క్‌ ఏర్పాటు చేశారు. ముఖాముఖిలో భాగంగా మొదటిగా డెమోక్రాటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమల హారిస్ మాట్లాడుతూ.. కరోనాను అరికట్టడంలో ట్రంప్‌ విఫలమయ్యారని, అమెరికా చరిత్రలో ట్రంప్‌ ఓ విఫల అధ్యక్షుడని తెలిపారు. కమల విమర్శలను రిపబ్లిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ‍్యర్థి మైక్‌ పెన్స్ ఖండిస్తూ.. కరోనాపై ఐదు కంపెనీలు ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయని తెలిపారు. కరోనా వాక్సిన్‌ రూపకల్పనలో భాగంగా ఈ ఏడాది చివరిలోగా అమెరికన్స్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువస్తామని సమాధానం ఇచ్చారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ అసమర్థతో అమెరికా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కమల హారిస్‌‌ అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఒబామా కేర్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అయితే ఒబామా కేర్‌ను ట్రంప్‌ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇరువురు ఉపాధ్యక్ష అభ్యర్థులు పలు అంశాలపై చర్చ కొనసాగిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top