పుతిన్‌ని వ్యతిరేకిస్తే ఖతం... జైల్లోనే మగ్గిపోయేలా ప్రతి పక్ష నాయకుడి పై కేసులు | Sakshi
Sakshi News home page

పుతిన్‌ దారికి అడ్డొస్తే అంతే...ఊచలెక్కెడుతూ.. ఉండిపోవాల్సిందే!

Published Tue, Mar 22 2022 9:29 PM

Jailed Putin Critic Alexei Navalny Found Guilty of Fraud In 9 Years - Sakshi

President Vladimir Putin’s most ardent foe in prison: ఉక్రెయిన్‌ పై  రష్యా గత మూడు వారాలకుపైగా ఘెరంగా విరుచుకుపడుతోంది. ఈ తరుణంలో రష్యా అధ్యుకుడికి సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచదేశాలు, ఆఖరికి అంతర్జాతీయ న్యాయ స్థానం సైతం యుద్ధం వద్దన్న తగ్గక పోవడంతో వ్లాదిమిర్‌ పుతిన్‌కి సంబంధిచిన వ్యక్తిగత వ్యవహార శైలి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్‌ తన ప్రతిపక్ష నాయకుడిని కూడా అలాగే ఇబ్బుందులకు గురిచేసి జైలు పాలు చేశాడని అతని రాజకీయ విమర్శకులు అంటున్నారు

వివరాల్లోకెళ్లే,....రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ పుతిన్‌కి పరమ బద్ద శత్రువని చెబుతున్నారు. అతని పై రష్యా అధికారులు సుదీర్ఘకాలం జైల్లో ఉండిపోయేలా కేసులు పెట్టారు. ఈ మేరకు రష్యా కోర్టు అలెక్సీ నవల్నీని ఛీటింగ్‌, కోర్టు దిక్కారాలకు పాల్పడినందుకు గానూ సుమారు 8 లక్షలు జరిమాన విధించడమే కాకుండా తోమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. నిజానికి నవాల్నీ పెరోల్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసు విషయమై రెండున్నర జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇప్పడూ మళ్లీ తనకు ఫౌండేషన్ సంబంధించి డబ్బును అపహరించారని, విచారణ సమయంలో న్యాయమూర్తిని అవమానించారని ఆరోపణలతో శిక్ష విధించారు. అతను జర్మనీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే 2021లో అరెస్టు చేశారు. ఆ తర్వాత రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. తదనంతరం అతని సహచరులను, మద్దతుదారులను అణిచివేయడమే కాకుండా నేరారోపణలు చేయడం మొదలు పెట్టారు. దీంతో వాళ్లు రష్యాని వదిలి వెళ్లిపోయారు. నిజానికి నవల్నీ అవినీతిపై పోరాడేందుకు ఒక ఫౌండేషన్‌ని ఏర్పాటు చేశాడు.

అంతేకాదు పుతిన్‌ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టేవాడు. దీంతో  రష్యా అధికారులు అతనిని అణిచివేసేలా కేసులు పెట్టి కటకటాల్లో ఉండేలా చేశారు. అంతేకాదు అతని ఫౌండేషన్‌కి సంబంధించిన దాదాపు 40 ప్రాంతీయ కార్యాలయాల నెట్‌వర్క్ తీవ్రవాదంగా నిషేధించారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు సుదీర్ఘం కాలంలో జైల్లో మగ్గిపోయాలా శిక్షలు విధించారు. నవల్నీ మద్దతుదారులు ఇది రాజకీయ కుట్ర అని, అతనిపై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ  మండిపడుతున్నారు. 

(చదవండి: హిట్లర్‌ నుంచి మిస్‌ అయినా.. పుతిన్‌ చేతిలో ఖతమయ్యాడు!)

Advertisement
Advertisement