పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంట్‌

International Criminal Court issues warrant for Russia president over Ukraine war crimes - Sakshi

ద హేగ్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) శుక్రవారం వెల్లడించింది. ఉక్రెయిన్‌లో పిల్లలను అపహరించిన ఘటనల్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యుద్ధనేరాలకు పాల్పడినట్లు గుర్తిస్తూ ఈ వారెంట్‌ జారీ చేసినట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

పిల్లలను ఇలా చట్టవిరుద్ధంగా మరో దేశానికి తరలించడం యుద్ధనేరమేనని పేర్కొంది. రష్యన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడి కార్యాలయంలో పిల్లల హక్కుల కమిషనర్‌గా పని చేస్తున్న మారియా అలెక్సేయేవ్‌నాను సైతం అరెస్టు చేయాలంటూ ఐసీసీ వారెంట్‌ జారీ చేసింది.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top