ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు!

Insane Of Lice Found From Young Girls Hair In Australia - Sakshi

మెల్‌బోర్న్‌ : ఈ ప్రపంచంలో జుట్టున్న ప్రతీవాళ్లు జీవితంలో ఒక్కసారైనా పేల సమస్యను ఎదుర్కొని ఉంటారనటంలో అతిశయోక్తి లేదు. పేల బారిన పడి ఓ సైన్యమే నాశనం అయిపోయిందని చరిత్ర చెబుతోంది. మామూలుగా ఒకటి, రెండు పేలుంటేనే తట్టుకోవటం చాలా కష్టం! అలాంటిది కుప్పలు తెప్పలుగా తల్లో పేలు పడితే.. ఆ బాధ ఊహించలేము. ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతి ఇలాంటి దారుణ పరిస్థితినే ఎదుర్కొంది. ఇక చేసేదేమీ లేక హెయిర్‌ లైస్‌ రిమూవలిస్ట్‌ను సంప్రదించింది. వివరాలు : ఆస్ట్రేలియాలోని కమిలోకు చెందిన ప్రముఖ హేయిర్‌ లైస్‌ రిమూవలిస్ట్‌ షెర్రీ రిచర్డ్‌సన్‌ ‘‘ నిట్‌ పైకర్స్‌ హెడ్‌ లైస్‌ రిమూవల్‌’’ పేరిట ఓ సెలూన్‌ నిర్వహిస్తోంది. కొద్దిరోజుల క్రితం విపరీతంగా పేలతో బాధపడుతున్న ఓ యువతి ఆమె వద్దకు వచ్చింది. ఈ నేపథ్యంలో దువ్వెనతో యువతి తలను దువ్విచూడగా ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఆమె తల్లో నుంచి పేలు బయటపడ్డాయి.

దీన్ని వీడియో తీసిన షెర్రీ తన టిక్‌టాక్ ఖాతా‌లో దాన్ని షేర్‌ చేసింది. దీంతో వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదు మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుంది. 75 వేలకుపైగా ప్రతిస్పందనలు వచ్చాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘బాబోయ్‌!  తల్లో పేల ఫ్యాక్టరీ ఉందా ఏంటి?’’.. ప్రేమలో పడినోళ్లు.. తల్లో పేలు ఉన్నోళ్లు సుఖపడినట్లు చరిత్రలో లేదు.’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

చదవండి : ‘ఇంట్లో రాక్షసులు: చంపి గుండెని కోసి కూర వండాడు’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top