డాక్టర్‌ గయానాలో పేషెంట్‌ ఇండోర్‌లో.. | Indian-origin cardiac surgeon Dr. Sudhir Srivastava sets robotic telesurgery | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ గయానాలో పేషెంట్‌ ఇండోర్‌లో..

Jun 9 2026 4:47 AM | Updated on Jun 9 2026 4:47 AM

Indian-origin cardiac surgeon Dr. Sudhir Srivastava sets robotic telesurgery

న్యూఢిల్లీ: భారతీయ వైద్యుడొకరు వైద్యరంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. సుమారు 20 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి రోబో సాయంతో గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత దూరంలో జరిగిన రోబోటిక్‌ కార్డియాక్‌ టెలిసర్జరీగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రముఖ రోబోటిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌ శ్రీవాస్తవ గయానాలోని జార్జ్‌టౌన్‌ పబ్లిక్‌ హాస్పిటల్‌ కార్పొరేషన్‌ నుంచి ఆపరేషన్‌ చేయగా రోగి మాత్రం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లోని ఓ ఆస్పత్రిలో ఉన్నారు. 

దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఎస్‌ఎస్‌ఐ మంత్ర’ సర్జికల్‌ రోబోటిక్‌ సిస్టమ్‌ ద్వారా ఈ ఆపరేషన్‌ చేశారు. శ్రీవాస్తవ గయానాలో కూర్చుని కన్సోల్‌ ద్వారా రోబోను నియంత్రిస్తుండగా, ఇండోర్‌లో ఉన్న రోబోటిక్‌ చేతులు ఆయన చేతుల కదలికలను కచ్చితత్వంతో అనుకరిస్తూ ఆపరేషన్‌ చేశాయి. 

భారత్‌లో ఈ ఆపరేషన్‌కు జైపూర్‌లోని మణిపాల్‌ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్‌ లలిత్‌ మాలిక్, భండారీ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్‌ రామ్‌ శుక్లా, ఇండోర్‌లోని ఇర్కాడ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోహిత్‌ భండారీలు సహకరించారు. రికార్డు నమోదవడంపై గయానాæ అధ్యక్షుడుæ మహ్మద్‌ ఇర్ఫాన్‌ హర్షం వ్యక్తం చేశారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి గుండెకు శస్త్రచికిత్సతో ప్రపంచ రికార్డ్‌
 

Advertisement
 
Advertisement
Advertisement