యూకేలో ఆలయాలపై దాడులు... కేంద్రం ఖండన

Indian High Commission in UK condemns vandalism of Hindu temple in Leicester - Sakshi

లండన్‌: యూకేలోని లీసెస్టర్‌ నగరంలోని భారతీయులపై దాడులు, అక్కడి ఆలయం ఆవరణలో విధ్వంసం ఘటనలను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడులకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూకే యంత్రాంగాన్ని డిమాండ్‌ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాలని కోరింది.

గత నెలలో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్‌ ఇండియా–పాకిస్తాన్‌ మ్యాచ్‌ అనంతరం నగరంలోని హిందూ ముస్లిం గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. లీసెస్టర్‌లోని ఆలయం వద్ద ఎగురవేసిన కాషాయ జెండాను కొందరు చించి వేస్తున్నట్లున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top