breaking news
temples vandalise
-
యూకేలో ఆలయాలపై దాడులు... కేంద్రం ఖండన
లండన్: యూకేలోని లీసెస్టర్ నగరంలోని భారతీయులపై దాడులు, అక్కడి ఆలయం ఆవరణలో విధ్వంసం ఘటనలను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడులకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూకే యంత్రాంగాన్ని డిమాండ్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాలని కోరింది. గత నెలలో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం నగరంలోని హిందూ ముస్లిం గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. లీసెస్టర్‌లోని ఆలయం వద్ద ఎగురవేసిన కాషాయ జెండాను కొందరు చించి వేస్తున్నట్లున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
గుప్త నిధుల కోసం ఆలయాలు ధ్వంసం
బ్రహ్మసముద్రం : గుప్త నిధుల కోసం పురాతన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటనలు మండలంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటున్నాయి. మండలంలోని పోలేపల్లి నుంచి భైరవానితిప్ప గ్రామానికి వెళ్లే దారిలోని పురాతన పాతప్ప స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం రెండురోజుల క్రితం ఆలయం బయట ఉన్న పాతప్ప స్వామి కట్టను తవ్వి ధ్వంసం చేశారు. అలాగే మూలవిరాట్ కట్టముందున్న పెద్ద బండరాయిని తొలగించి అక్కడ పెద్ద గోతిని తవ్వారు. విషయం ఆదివారం ఉదయం గ్రామస్థులు గమనించి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలో గతంలో యరడికెర చెరువు కట్టమీదనున్న పురాతన శివాలయంతోపాటు, వేపలపర్తి లక్ష్మి రంగనాథస్వామి ఆలయం, పాల వెంకటాపురం కొండల్లో సైతం తవ్వకాలు జరిగాయి . ఈ సంఘటనలపై గ్రామస్థులు ఆలయకమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిచా పట్టించుకున్న దాఖాలాలు లేవు. ఎండో మెంట్ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో తరచూ పురాతన ఆలయాలను గుప్తనిధుల కోసం ధ్వంసం చేస్తున్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.