భారతీయ అమెరికన్‌ రిచర్డ్‌ వర్మకు కీలక పదవి | Indian-American Richard Verma to be Deputy Secretary of State for Management and Resources | Sakshi
Sakshi News home page

భారతీయ అమెరికన్‌ రిచర్డ్‌ వర్మకు కీలక పదవి

Dec 25 2022 6:15 AM | Updated on Dec 25 2022 6:15 AM

Indian-American Richard Verma to be Deputy Secretary of State for Management and Resources - Sakshi

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్‌ రిచర్డ్‌ వర్మ (54) అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్‌మెంట్, రీసోర్సెస్‌ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులు కానున్నారు. అధ్యక్షుడు బైడెన్‌ ఈ మేరకు ప్రతిపాదించారు. ఇందుకు సెనేట్‌ ఆమోదం తెలిపితే విదేశాంగ శాఖలో అత్యున్నత పదవి చేపట్టనున్న భారతీయ అమెరికన్‌ వర్మ అవుతారు.

ఆయన 2015–17 మధ్య భారత్‌లో అమెరికా రాయబారిగా కూడా పనిచేశారు.  ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం మాస్టర్‌ కార్డ్‌ సంస్థ చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్‌గా, గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement