Imran Khan: భారత్‌పై మరోసారి పొగడ్తల వర్షం కురిపించిన ఇమ్రాన్‌ఖాన్‌

Imran Khan Played Jaishankar Video Clip Praise India Foreign Policy - Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌పై  మరోసారి ప్రశంసలు జల్లు కురిపించాడు పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. ఒకవైపు పశ్చిమ దేశాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై వస్తున్న విమర్శలను ఖండిస్తూ... పాక్‌ మాజీ ప్రధాని భారత్‌ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు లాహోర్‌లోని భారీ సభను ఉద్దేశిస్తూ... భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ రష్యా చమురు కొనుగోలు విషయమై స్లోవేకియాలో జరిగిన బ్రాటిస్లావా ఫోరమ్‌లో జూన్‌ 3న మాట్లాడిన వీడియో క్లిప్‌ని ప్లే చేశాడు.

రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం విషయంపై భారత్‌పై అమెరికా ఒత్తిడి పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌ పై యుద్ధం చేసేలా రష్యాకు నిధులు చేకూరుస్తున్నారంటూ అమెరికా దాని మిత్ర దేశాలై పశ్చిమ దేశాలు పెద్దఎత్తున్న భారత్‌పై ఆరోపణలు చేశాయి. ఆ సమయంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ ప్రజలకు కావల్సినంత మేర గ్యాస్‌ కొంటాం అని స్పష్టం చేశారు. యూరప్‌ దేశాలు రష్యా నుంచి గ్యాస్‌ దిగుమతి చేసుకుంటుండగా కేవలం భారత్‌నే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగారు.

మరోవైపు రష్యా ఉక్రెయిన్‌ పై దాడికి దిగడానిన భారత్‌ ఖండిస్తుందని ఇరుదేశాలు సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకునే దిశగా తమ వంతు సాయం అందిస్తామని కూడా భారత్‌ చెప్పిన విషయాన్ని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తావించారు. భారత్‌-పాకిస్తాన్‌ ఒకే సమయంలో స్వాతంత్య్రాన్ని పొందాయి. కానీ తమ ప్రజలకు అనుగుణంగా భారత్‌ విదేశాంగ విధానాన్ని రూపొందించిందని ప్రశంసించారు. అంతేకాదు రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్‌ పై వస్తున్న విమర్శలను ఖండించడమే కాకుండా న్యూఢిల్లీ అమెరికా ఒత్తిడికి తలవొంచకుండా తీసుకున్న దృఢమైన వైఖరిని ఎంతగానో మెచ్చుకున్నారు.

పైగా భారత్‌ అమెరికా వ్యూహాత్మక మిత్రదేశమని కూడా అన్నారు. కానీ పాక్‌.. భారత్‌లా చెప్పలేదు. పాక్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి నో చెప్పే ధైర్యం చేయలేకపోయింది. పైగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని వివరణ ఇచ్చుకోలేక పోయింది. అంతేకాదు ఇమ్రాన్‌ ఖాన్‌ మరో విషయం గురించి ప్రస్తావిస్తూ... కేవలం భారత్‌ చౌకగా రష్యా చమురు కొనుగోలుతో యుద్ధానికి నిధులు సమకూరుస్తే మరీ యూరప్‌ దేశాలు కూడా రష్య చమురు కొనుగోలు చేస్తున్నాయి కదా మరీ అవి కూడా యుద్ధానికి నిధులు సమకూర్చినట్లేనా! ఒక్కసారి ఆలోచించండి అని భారత్‌కి మద్ధతుగా మాట్లాడారు. 

( చదవండి: మా చేతులు క‌ట్టేసిన‌ట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్‌ ఖాన్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top