టన్నెల్‌లో హమాస్‌ అగ్రనేత! ఐడీఎఫ్‌ వీడియో విడుదల | Sakshi
Sakshi News home page

టన్నెల్‌లో హమాస్‌ అగ్రనేత! ఐడీఎఫ్‌ వీడియో విడుదల

Published Wed, Feb 14 2024 6:27 PM

IDF Footage Hamas Commander Yahya Sinwar Spotted Tunnel With Family - Sakshi

ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలోని హమాస్‌ దళాలపై దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) మంగళవారం ఓ వీడియోను విడుదల చేసింది. అక్టోబర్‌ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడిచేసిన చేసినప్పటి నుంచి హమాస్‌ అగ్రనేత యాహ్యా సిన్వార్ దొరకకుండా ఇజ్రాయెల్‌ సైన్యానికి తలనొప్పిగా మారాడు. అయితే తాజాగా ఐడీఎఫ్‌ విడుదల వీడియోలో.. గాజాలోని ఓ టన్నెల్‌ యాహ్యా సిన్వార్ తన కుటుంబసభ్యులతో కనిపించాడు. 

ఐడీఎఫ్‌ విడుదల చేసిన వీడియో ప్రకారం.. దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్ ప్రాంతంలోని ఓ టన్నెల్‌లో యాహ్యా సిన్వార్‌ను, తన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడు ఇబ్రహీంతో కనిపించారు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి తాము యాహ్యా సిన్వార్‌ను టన్నెల్‌లోని వీడియోలో గుర్తించామని ఐడీఎఫ్‌ పేర్కొంది.

ఐడీఎఫ్‌ ప్రతినిధి డేనియల్ హగారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక వీడియోలో హమాస్‌నేను చూసింది ఏమాత్రం పెద్ద విషయం కాదు. మేము.. హమాస్ నేతలు,   వారి చెరలో ఉ‍న్న ఇజ్రాయెల్‌​ బందీల వద్దకు చేరుకోవటమే చాలా ముఖ్యమైన విషయం. మేము హమాస్‌ నేతలు, సిన్వార్‌ను పట్టుకునే వరకు ఈ యుద్ధం ఆపము. అతను చనిపోయి ఉన్నా? సజీవంగా ఉ‍న్నా? అతన్ని పట్టుకోవటమే మా లక్ష్యం’ అని  డేనియల్‌ తెలిపారు.

61 ఏళ్ల యాహ్యా సిన్వార్.. హమాస్ మాజీ ఎజ్డైన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్‌కు కమాండర్‌గా పనిచేశారు.  2017లో పాలస్తీనాలోని హమాస్‌ గ్రూపు చీఫ్‌గా ఎన్నికయ్యారు. అతను 2011లో విడుదలకు ముందు ఇజ్రాయెల్ జైళ్లలో 23 ఏళ్లు యుద్ధ ఖైదీగా ఉన్నారు. హమాస్ చేత బందీగా ఉన్న ఫ్రెంచ్-ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్‌ అనే యుద్ధ ఖైదీ మార్పిడిలో సిన్వార్‌ విడుదల అయ్యారు.

చదవండి: ఇజ్రాయెల్‌ అరాచకం.. హమాస్‌ అగ్రనేత కుమారుడు మృతి!

Advertisement
Advertisement