ఫ్లోర్లు ఊడ్చా..టాయ్‌లెట్లు క్లీన్‌ చేశా...కానీ: హీరోయిన్‌

I Swept Floors And Cleaned Toilets Mahira Khan Once recalled her struggle - Sakshi

జీవితంలో అనుకున్నది సాధించాలంటే..అనేక కష్టనష్టాల్ని భరించాలి. ఆటుపోట్లను తట్టుకుని రాటు దేలాలి. అపుడు మాత్రమే అందరికంటే  మిన్నగా, ఉన్నతంగా నిలుస్తాం. అందులోనూ సినీ పరిశ్రమలో మహిళలు రాణించాలంటే మరింత కష్టపడాలి.  దేశం ఏదేనా.. ప్రాంతం  ఏదైనా సినీ హీరోయిన్లకు ఇదే  పరిస్థితి...!

మహీరా ఖాన్ పాకిస్తాన్‌లో పాపులర్‌ హీరోయిన్‌, అత్యధిక పారితోషికం తీసుకునే నటి.'ఖిరాద్'టీవీ సీరియల్‌తో పాటు, ఫవాద్ ఖాన్‌తో నటించిన హమ్‌ సఫర్తో మరింత పాపులరయ్యారు.  2017లో మహిరా షారుఖ్ ఖాన్ సరసన నటించిన రయీస్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.  ఇటీవలే వ్యాపారవేత్త సలీం కరీమ్‌తో రెండో వాహం చేసుకుంది.  ఈ వివాహానికి సంబంధించిన  ఫోటోలు,వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌  అయ్యాయి. దీంతోపాటు  మహిరా ఖాన్‌ తన జీవితంలో ఎదుర్కొన్న  కష్టాలను, పైకి ఎదగడానికి పడిన పోరాటాన్ని  గుర్తు చేసుకున్నారు.

తన కెరీర్‌లో ఒకానొక సమయంలో ఫ్లోర్‌లు ఊడ్చి, టాయిలెట్లను శుభ్రం చేశానని  గతంలో ఒక మ్యాగజైన్‌ ఇచ్చిన  గుర్తు చేసుకున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ,  జీవనం సాగించానని చెప్పుకొచ్చారు. లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నప్పుడు టాయిలెట్లను శుభ్రం చేయడం,  ఫ్లోర్లను శుభ్రం చేయడం లాంటివి చేశానన్నారు.   నిజానికి చేతిలో ఒక్క డాలర్‌ కూడా లేని టైంలో ఉన్న కొద్ది పాటి భోజనాన్ని  సోదరుడితో కలిసి సర్దుకున్న  వైనాన్ని వివరించారు.

బైపోలార్ డిజార్డర్‌తో బాధపడ్డా
సెలబ్రిటీ జీవితంలో కఠినమైన విమర్శలు ఎంత అనివార్యమైన భాగమని పేర్కొన్నారు. తాను కూడా  బైపోలార్ డిజార్డర్ అనే 'మానిక్ డిప్రెషన్'తో పోరాడినట్లు వెల్లడించారు. ముఖ్యంగా "రయీస్" చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా ఇటీవల వెల్లడించారు. దాదాపు ఆరేడు సంవత్సారలు  యాంటి డిప్రెసెంట్స్‌తో మేనేజ్‌చేసినట్టు తెలిపారు. .తన ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి రావడం తనకు  చాలా గొప్ప విషయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. జీవితంలో చాలాసార్లు ఓడిపోతాం.. కానీ  ఆశాభావంతో ముందుకు సాగాలి. తన జీవితంలో కూడా చాలా కష్టమైన పీరియడ్‌ ఒకటుందని అందరికీ తెలియాలనే తానే విషయాలన్నీ షేర్‌ చేస్తున్నాన్నారు  

సలీం కరీమ్‌తో మహిరా ఖాన్ రెండో వివాహం
ఈ ఏడాదిల అక్టోబర్ 2 మహీరా ఖాన్ , తన చిరకాల మిత్రుడు సలీం కరీంని రెండో వివాహం చేసుకుంది. అయితే అంతకు ముందు 17 ఏళ్ల వయసులో అలీ అక్సారిని పెళ్లాడింది. అజ్లాన్ అనే కుమారుడున్నాడు. అయితే  2015లో కొన్ని అనివార్య కారణాలతో  ఈ జంట విడిపోయింది.  అటు అలీ కూడా రెండో పెళ్లి  చేసుకున్నాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top