
జీలం: పాకిస్తాన్‌లోని జీలం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో.. 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్(Lashkar-e-Taiba chief Hafiz Saeed) హతమయ్యాడని సమాచారం. అయితే హఫీజ్ సయీద్ మృతిని పాక్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు. హతమైన వారిలో లష్కర్ ఉగ్రవాది అబూ కతల్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని జీలంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా, ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో అబూ కతల్ కూడా ఉన్నాడని, అతను ఎల్ఇటి ఉగ్రవాది అని, అతను హఫీజ్ సయీద్ మేనల్లుడని అధికారులు తెలిపారు.
భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితా(List of most wanted terrorists)లో హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. అలాగే పుల్వామా దాడికి కూడా హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థపై దాదాపు 10 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. ఉగ్రవాద నిధులకు సంబంధించిన కేసులో హఫీజ్ సయీద్‌ను జైలుకు తరలించారు. హఫీజ్ సయీద్ కాశ్మీర్‌లో ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నాడు. హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను అభ్యర్థించింది.
జమ్ముకశ్మీర్‌లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడటమే కాకుండా, ముంబైలో జరిగిన 26/11 దాడుల కుట్ర హఫీజ్ సయీద్ పన్నినదే అని నిర్థారణ అయ్యింది. దాడులు జరిగిన సమయంలో అతను దాడి చేసిన వారితో టచ్‌లో ఉన్నాడని సమాచారం. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో 160 మందికి పైగా జనం మృతి చెందారు. భారతదేశంతో పాటు పలు దేశాలు హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాయి. హఫీజ్ సయీద్‌తో పాటు అతని ఉగ్ర సంస్థపై అమెరికా రివార్డు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు