breaking news
Hafiz
-
హఫీజ్ మరో కుట్ర:‘బంగ్లా’ నుంచి భారత్‌పై దాడులు?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారతదేశంపై దాడులకు కుట్ర పన్నుతున్నారని, ఇందుకు బంగ్లాదేశ్‌ను కొత్త వేదికగా ఎంచుకున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్ కూడా నిఘావర్తాలకు అందిందని ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.అక్టోబర్ 30న పాకిస్తాన్‌లోని ఖైర్పూర్ తమేవాలిలో జరిగిన ర్యాలీలో సీనియర్ ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా సైఫ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ వీడియోలో ‘హఫీజ్ సయీద్ ఖాళీగా కూర్చోలేదు.. అతను బంగ్లాదేశ్ మార్గంలో భారతదేశంపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడు’ అని సైఫుల్లా సైఫ్ స్పష్టంగా చెప్పాడు. లష్కర్ ఎ తోయిబా సభ్యులు ఇప్పటికే తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)లో చురుకుగా ఉన్నారని, భారతదేశానికి (ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా) సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.కాగా సయీద్ ‘జిహాద్’ నెపంతో బంగ్లాదేశ్ యువతకు ఉగ్రవాద శిక్షణ అందించేందుకు ఆ దేశానికి సైఫుల్లా సైఫ్‌ను పంపాడు. ఈ శిక్షణ కార్యక్రమానికి పిల్లలు హాజరుకావడం విశేషం. కాగా ఒక వీడియోలో సైఫ్ పాకిస్తాన్ సైన్యాన్ని ప్రశంసించాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, ఇప్పుడు, అమెరికా మనతో ఉందని, బంగ్లాదేశ్ కూడా మళ్లీ పాకిస్తాన్‌కు దగ్గరవుతోందని వ్యాఖ్యానించాడు. ఈ వాదనలు కార్యక్రమానికి హాజరైన ధైర్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. కాగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ దోస్తీతో ఏర్పడబోయే ముప్పుపై భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న చొరబాట్లపై నిఘాను తీవ్రతరం చేశాయి.ఇది కూడా చదవండి: కాశ్మీర్లో కలకలం.. ఉగ్రవాదులతో వైద్యుల దోస్తీ? -
తెలుగు యూట్యూబర్‌కు బంపరాఫర్
తన వద్ద పెద్దగా డబ్బు లేదు.. ఎవరి సపోర్ట్ కూడా లేదు.. కానీ, పెద్ద ప్రణాళిక ఉంది.. అంతకుమించి పట్టుదల ఉంది.. దాంతోనే రోజూ కొత్త విషయాలు నేర్చుకొని.. ఆ అంశాలనే ప్రజలతో పంచుకున్నాడు. వంద రూపాయలతో మొదలైన యూట్యూబర్ జీవితం నెలకు రూ.3లక్షల వరకు చేరింది. ఇలా సంపాదిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు.ప్రపంచమే గుప్పిట్లో చేరిన ఈరోజుల్లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్. మొదట్లో హఫీజ్ వీడియోలకు కావలిసినంత వీక్షకులు రాకపోగా, ఇదెవరు చూస్తారని స్నేహితులు ఎగతాళి చేశారు. అయినా నిరాశ పడలేదు. క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూనే వచ్చారు. తన కృషికి ఫలితంగా గోల్డెన్ వీసా వరించింది. ప్రజలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడమే కాదు.. ప్రజలతో పంచుకోవడం విశేషం. గోదావరిఖని(రామగుండం): రోజూ రూ.వందతో మొదలైన యూట్యూబర్ జీవితం నేడు నెలకు రూ.2లక్షల నుంచి 3లక్షల వరకు సంపాధిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు. సింగరేణి కార్మికుని బిడ్డగా ఈప్రాంత వాసులను టెక్నాలజీలో అనేక అంశాల్లో చైతన్యవంతం చేస్తున్నాడు. సెల్ఫోన్లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ముందుగా యైటింక్లయిన్‌కాలనీలో కంప్యూటర్ సెంటర్ నడిపించిన హఫీజ్‌ను యూట్యూబ్ ఉన్నత శిఖరాలకు చేర్చింది. ప్రస్తుతం ఎన్టీపీసీలో ఉంటూ TELUGU TECH TUTS యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించి యూఏఈ గోల్డెన్వీసా అందుకున్నాడు.చిన్ననాటి నుంచి ఆసక్తిచిన్నప్పటి నుంచి కంప్యూటర్‌పై పట్టున్న హఫీజ్ మొబైల్, కంప్యూటర్ గాడ్జెట్ల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చేవాడు. మొదట ఇంగ్లిష్ టెక్ యూట్యూబర్ల వీడియోలు చూస్తూ పట్టు సాధించాడు. 2011లో “తెలుగు టెక్ ట్యూట్’ యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. మొదట్లో స్మార్ట్‌ఫోన్ కెమెరాతోనే వీడియోలు తీయడం ప్రారంభించాడు. హఫీజ్ వీడియోలకు కావలిసినంత వీక్షకులు లేకపోయినా, స్నేహితులు కొందరు ఇదెవరు చూస్తారని ఎగతాలి చేశారు.పట్టుదల, క్రమశిక్షణహఫీజ్ క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూ వచ్చారు. మొబైల్ రివ్యూలు, కొత్త యాప్స్ పరిచయం, ఆన్లైన్ సంపాదన మార్గాలు, సెక్యూరిటీ ట్రిక్స్ తదితర విషయాలను వీక్షకులకు వివరించాడు. తెలుగులో లక్ష మంది సబ్‌స్రై్కబర్స్, వన్ మిలియన్ వ్యూస్ సాధించిన టెక్ చానల్‌గా రికార్డుకెక్కింది. 2018లో సోషల్ మీడియా సమ్మిట్ అవార్డు, 2019లో టాప్ తెలుగు క్రియేటర్స్ జాబితాలో చోటు దక్కింది.2022లో ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ లిస్ట్‌లో చోటు సాధించగా, బెస్ట్ తెలుగు టెక్క్రియేటర్ అవార్డు వరించింది. యూట్యూబ్ కాకుండా బ్రాండ్ డీల్స్, స్పాన్సర్షిప్స్, యాప్ ప్రమోషన్స్ ద్వారా ప్రతినెలా రూ.2 లక్షల నుంచి 3లక్షల ఆదాయం వస్తోంది. హఫీజ్ కృషిని గుర్తించిన యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందించింది. పదేళ్ల పాటు యూఏఈలో కుటుంబ సభ్యులతో సహా జీవించే అవకాశం ఉంటుంది.మరింత మందిని తయారుచేస్తాటెక్, యూట్యూబ్, ఆన్లైన్ క్రియేటివ్ ఫీల్డ్‌లో ముందుకు రావాలనుకునే యువతకు గైడెన్స్ ఇవ్వాలని ఉంది. యువతకు ఉచిత వర్క్‌షాప్‌లు, ఆన్లైన్ గైడెన్స్ ప్రోగ్రామ్‌లు, స్మార్ట్ డిజిటల్ కెరీర్ మార్గాలు చూపించాలనుకుంటున్న.– సయ్యద్ హఫీజ్, తెలుగు టెక్ట్యూట్ క్రియేటర్ -
26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ హతం?
జీలం: పాకిస్తాన్‌లోని జీలం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో.. 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్(Lashkar-e-Taiba chief Hafiz Saeed) హతమయ్యాడని సమాచారం. అయితే హఫీజ్ సయీద్ మృతిని పాక్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు. హతమైన వారిలో లష్కర్ ఉగ్రవాది అబూ కతల్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని జీలంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా, ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో అబూ కతల్ కూడా ఉన్నాడని, అతను ఎల్ఇటి ఉగ్రవాది అని, అతను హఫీజ్ సయీద్ మేనల్లుడని అధికారులు తెలిపారు.భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితా(List of most wanted terrorists)లో హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. అలాగే పుల్వామా దాడికి కూడా హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థపై దాదాపు 10 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. ఉగ్రవాద నిధులకు సంబంధించిన కేసులో హఫీజ్ సయీద్‌ను జైలుకు తరలించారు. హఫీజ్ సయీద్ కాశ్మీర్లో ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నాడు. హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను అభ్యర్థించింది.జమ్ముకశ్మీర్‌లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడటమే కాకుండా, ముంబైలో జరిగిన 26/11 దాడుల కుట్ర హఫీజ్ సయీద్ పన్నినదే అని నిర్థారణ అయ్యింది. దాడులు జరిగిన సమయంలో అతను దాడి చేసిన వారితో టచ్‌లో ఉన్నాడని సమాచారం. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో 160 మందికి పైగా జనం మృతి చెందారు. భారతదేశంతో పాటు పలు దేశాలు హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాయి. హఫీజ్ సయీద్‌తో పాటు అతని ఉగ్ర సంస్థపై అమెరికా రివార్డు ప్రకటించింది.ఇది కూడా చదవండి: Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు -
చెప్పులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, చెన్నై : ఖరీదైన పది జతల చెప్పులు పోయాయంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన ఘటన తమిళనాడులోని చెన్నైలో గతవారం చోటుచేసుకుంది. పాదరక్షల మాయంపై ఫిర్యాదుపై పోలీసులు విస్తుపోయినప్పటికీ, చివరికి కేసు నమోదు చేసి చెప్పుల దొంగ కోసం దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే... కీల్పాకం సెక్రటేరియేట్ కాలనీ దివాన్ బహుదూర్ షణ్ముగం రోడ్డుకు చెందిన అబ్దుల్ రఫిక్(46) నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. తన ఇంటి ముందు ఉన్న ర్యాక్‌లో ఉంచిన రూ. 80 వేలు విలువైన 12 జతల షూలు, ఏడు జతల పాదరక్షలు మాయమైనట్టుగా సెక్రటేరియేట్ కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్రాండెడ్ పాదరక్షలను అపహరించుకు వెళ్లారని ఆయన ఇచ్చిన ఫిర్యాదును చూసి పోలీసులు విస్తుపోయారు. కాగా చెప్పులు మాయంపై అబ్దుల్ రఫిక్ ....పొరుగున ఉండే బ్యాచ్‌లర్స్‌తో పాటు తన ఇంట్లో పని చేసే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల చివరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని ఆధారాల కోసం సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా రఫిక్ పొరుగున ఉండే వాళ్లను కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
విధ్వంసం కుట్ర బట్టబయలు
ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు రాజ్‌కోట్/అహ్మదాబాద్: భారత్‌లో విధ్వం సానికి ప్రణాళికలు రూపొందిస్తున్న ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఏ సంస్థ సహాయం లేకుండా ఒంటరిగానే విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధమైనట్లు పోలీసు లు తెలిపారు. గుజరాత్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాలనుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌కోట్‌కు చెందిన వసీం రమోడియా (ఎంసీఏ విద్యార్థి), నయీమ్ (బీసీఏ)లు ఐసిస్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. ఈ ఇద్దరి నుంచి బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలైన చోతిలా (దేవీ మందిరం)తోపాటు పలుచోట్ల దాడులకు వీరిద్దరూ ప్రణాళికలు రూపొందించారని.. పక్కా సమాచారంతోనే వీరిపై నిఘాపెట్టి అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఐజీ జేకే భట్ వెల్ల డించారు. రాజ్‌కోట్ నుంచి రమోడియాను, నయీమ్‌ను భావ్‌నగర్‌లో అరెస్టు చేశారు. ఉగ్రఘటనతో దేశమంతా కలకలం సృష్టించేందుకు విధ్వం సం వీడియోను రికార్డు చేసి దీన్ని సోషల్ మీడియాలో పెట్టాలని ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని భట్ తెలిపారు. బాంబులు పేల్చడంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టడం ద్వారా భయాందోళనలు సృష్టించాలనేదీ వీరి ప్లాన్ లో భాగమన్నారు. రెండేళ్ల క్రితం జిహాదీ భావజాలంవైపు ఆకర్షితులైన వీరిద్దరూ.. ఆన్ లైన్ రా ఐసిస్‌తో సంబంధాలు నెరపుతున్నారు. అఫ్గాన్ లో కేరళ ఉగ్రవాది హతం: కేరళలోని పాలక్కడ్‌జిల్లాలో అదృశ్యమై ఐసిస్‌లో చేరి నట్లుగా అనుమానిస్తున్న 21 మందిలో ఒకరైన హఫీజ్ (26) హతమైనట్లు తెలిసింది. అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులపై జరిపిన డ్రోన్ దాడుల్లో హఫీజ్ మృతిచెందాడు. -
పాక్ క్రికెట్లో పంచాయతీ
► ఆమిర్ రాకపై సీనియర్ల ఆగ్రహం ► క్యాంప్‌ను బహిష్కరించిన హఫీజ్, అజహర్ లాహోర్: పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ పునరాగమనం పాకిస్తాన్ క్రికెట్లో చిచ్చు పెట్టింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న అనంతరం ఆమిర్ ఇటీవలే మళ్లీ పోటీ క్రికెట్ బరిలోకి దిగాడు. అయితే అతని రాకపై ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్, వన్డే జట్టు కెప్టెన్ అజహర్ అలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో వారిద్దరు పాక్ జట్టు జాతీయ శిబిరంకు తాము హాజరు కాలేమంటూ బహిష్కరించారు. న్యూజిలాండ్ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా 26 మంది క్రికెటర్లతో పాక్ బోర్డు నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంప్‌కు ఆమిర్‌ను ఎంపిక చేశారు. సోమవారం ప్రారంభమైన ఈ క్యాంప్‌కు దేశవాళీ క్రికెట్ కారణంగా తొలి మూడు రోజులు హఫీజ్, అజహర్ రాలేదు. గురువారం జట్టుతో చేరాల్సిన వీరిద్దరు డుమ్మా కొట్టినట్లు మేనేజర్ ఆగా అక్బర్ నిర్ధారించారు. అజహర్ అలీ నేరుగా కారణం చెప్పేయగా, హఫీజ్ ఏమీ చెప్పకుండానే తన నిరసన ప్రకటించాడు. ‘ఆమిర్ అక్కడ ఉన్నంత వరకు నేను శిబిరానికి హాజరు కాను. దీనిపై అవసరమైతే పీసీబీతో చర్చిస్తా. హఫీజ్ గురించి నేను మాట్లాడను కానీ బహుశా అతను కూడా ఇదే కారణంతో తప్పుకొని ఉండవచ్చు’ అని అజహర్ స్పష్టం చేశాడు. -
ఆధిక్యంలో పాకిస్తాన్
షార్జా: ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (155 బంతుల్లో 97 బ్యాటింగ్; 9 ఫోర్లు; 3 సిక్సర్లు) అద్భుత ఆటతీరుతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ ప్రస్తుతం 74 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో మూడు వికెట్లకు 146 పరుగులు చేసింది. అజహర్ అలీ (115 బంతుల్లో 34) చక్కటి తోడ్పాటునందించడంతో తొలి వికెట్‌కు 101 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడింది. షోయబ్ డకౌట్ కాగా సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ (14) విఫలమయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 126.5 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటయింది. టేలర్ (161 బంతుల్లో 76; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (118 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. షోయబ్‌కు నాలుగు, యాసిర్‌కు మూడు, రాహత్‌కు రెండు వికెట్లు దక్కాయి.


