వయసు తలకిందులు 

Guinness World Record: 75 Year Old Performs Headstand Successfully - Sakshi

75 ఏళ్ల వయసంటే.. నడవడానికి కూడా కష్టమే. అలాంటిది తలకిందులుగా నిలబడటమంటే మామూలు విషయం కాదు. కానీ ఒకాయన మాత్రం ఆ వయసులోనూ తలకిందులుగా నిలబడి రికార్డు సృష్టించారు. అలాంటిలాంటి రికార్డు కాదు.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు. 70 పదుల వయసులో ఇలాంటి పేరు సంపాదించిన ఆ వ్యక్తి పేరు టానియో హిలోవు. ఈయన కెనడాకు చెందిన వ్యక్తి. తలకిందులుగా నిలబడటాన్ని సరిగా చేయకపోతే మెడ, తలపై గాయాలవుతాయి.

మామూలుగా యువకులుగా ఉన్నప్పుడే ఇవి చేస్తుంటారు. 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఇలాంటివి చేయకూడదని చెబుతుంటారు. అయితే టానియో మాత్రం.. శారీరక సవాళ్లను ఏ వయసులోనైనా ఎదుర్కోవచ్చని చెప్పడానికి ఈ ప్రయత్నం చేశానన్నారు. గతేడాది అక్టోబర్‌లో టానియో గిన్నిస్‌ రికార్డు సాధించగా ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరలైంది.      
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top