అమెరికాలో పెరుగుతున్న ఆసియన్ల జనాభా

Growing Asian population in America - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో ఆసియన్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. మరే ఇతర మైనార్టీల కంటే ఆసియన్ల సంఖ్య గత దశాబ్ద కాలంలో చాలా పెరిగిందని ఆ దేశ జనాభా లెక్కల్లో వెల్లడైంది. 2020 సంవత్సరం నాటికి ఆసియన్‌ అమెరికన్ల సంఖ్య 2.4 కోట్లకు చేరుకున్నట్టు తేలింది. అమెరికా జనాభా గణన బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాలో మైనార్టీ కమ్యూనిటీల ప్రాబల్యమే ప్రస్తుతం అధికంగా ఉంది. అందులోనూ ఆసియన్లు 7.2 శాతం మంది ఉన్నారు.

1776 అమెరికా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా వైట్‌ అమెరికన్ల సంఖ్య తగ్గడం విశేషంగా చెప్పుకోవాలి. అమెరికాలో  తెల్లజాతీయులు సంఖ్య తొలిసారిగా 60శాతానికి దిగువకి పడింది. 2000ఏడాదిలో వారి జనాభా 69 శాతం ఉంటే 2010 నాటికి 63.7శాతానికి తగ్గింది. 2020లో ఇది 58 శాతానికి తగ్గినట్టుగా జనగణనలో వెల్లడైంది. అమెరికాలో గత దశాబ్దకాలంలో మొత్తంగా జనాభా 7.4% పెరిగి 33.1 కోట్లకు చేరుకుంది. 1930 తర్వాత జనాభా అతి తక్కువగా పెరగడం గత దశాబ్దంలోనే జరిగింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top