మెయిల్ బ్యాలెట్ల పంపిణీ నిలిపివేత
త్వరలో సుప్రీంకోర్టుకు ట్రంప్ ప్రభుత్వం
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఈ మెయిల్ బ్యాలెట్ ఓటర్లను తగ్గించే ఉద్దేశంతో ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుకు ఫెడరల్ జడ్జి ఒకరు బ్రేక్ వేశారు. మధ్యంతర ఎన్నికల్లో భాగంగా ఇంకో వారం రోజుల్లో మెయిల్ బ్యాలెట్ల పంపిణీ మొదలు కానుండగా యూఎస్ డి్రస్టిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఇందిరా తల్వానీ ట్రంప్ నిర్ణయాన్ని రెండు వారాలపాటు నిలిపివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ సెపె్టంబరు మూడున జరగనున్నాయి. అయితే ప్రభుత్వం దీన్ని త్వరలోనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశముంది.
ఈమెయిల్ ఓట్లను కుదిస్తూ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను డెమొక్రాటిక్ పార్టీ అధికారంలో రాష్ట్రాలు, వోటింగ్ హక్కుల సంఘాలు గతంలోనే సవాలు చేశాయి. అయితే సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం ఒక తీర్పునిస్తూ కొత్త ఉత్తర్వులు తుదిరూపంలో లేవని, ముందుగానే దావా వేశారని పేర్కొంటూ ఇందిరా తల్వానీ గతంలో ఇచి్చన నిషేధాజ్ఞల్లో ఒకదాన్ని ఎత్తివేసింది. ఈమెయిల్ బ్యాలెట్ల పంపిణీ బాధ్యతలు చూసే పోస్టల్ విభాగం ఫైనల్ నియమాలను ప్రచురించడంతో డెమోక్రాట్ రాష్ట్రాలు, ఓటింగ్ హక్కుల సంస్థలు తాజాగా మరోసారి కేసులు వేశారు.
పోస్టల్ విభాగం కొత్త నియమం ప్రకారం... ఆయా రాష్ట్రాలు ఓటర్ల జాబితాను అందివ్వాలి. బ్యాలెట్ ఎవరికి పంపాలి? ఎన్వలప్‌ల డిజైన్, రకం వంటివి ముందుగానే నిర్ధారించాలి. అంతేకాకుండా.. రాష్ట్రాలు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి; సిటిజన్ డేటాను అప్‌లోడ్ చేయాలి; ఎలక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేయాలి; అధికారులకు శిక్షణ ఇవ్వాలి. అయితే.. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నది ప్రతివాదుల వాదన. ఎన్నికల నియమాలను రూపొందించి అధికారం రాష్ట్రాలకు, అవసరమైతే కాంగ్రెస్‌కు ఉంటాయి కానీ.. పోస్టల్ విభాగం, అధ్యక్షుడు ట్రంప్‌కు కాదని వీరు అంటున్నారు.


