breaking news
Indira Talwani
-
ట్రంప్ ఉత్తర్వులకు జడ్జి బ్రేక్!
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఈ మెయిల్ బ్యాలెట్ ఓటర్లను తగ్గించే ఉద్దేశంతో ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుకు ఫెడరల్ జడ్జి ఒకరు బ్రేక్ వేశారు. మధ్యంతర ఎన్నికల్లో భాగంగా ఇంకో వారం రోజుల్లో మెయిల్ బ్యాలెట్ల పంపిణీ మొదలు కానుండగా యూఎస్ డి్రస్టిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఇందిరా తల్వానీ ట్రంప్ నిర్ణయాన్ని రెండు వారాలపాటు నిలిపివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ సెపె్టంబరు మూడున జరగనున్నాయి. అయితే ప్రభుత్వం దీన్ని త్వరలోనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశముంది. ఈమెయిల్ ఓట్లను కుదిస్తూ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను డెమొక్రాటిక్ పార్టీ అధికారంలో రాష్ట్రాలు, వోటింగ్ హక్కుల సంఘాలు గతంలోనే సవాలు చేశాయి. అయితే సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం ఒక తీర్పునిస్తూ కొత్త ఉత్తర్వులు తుదిరూపంలో లేవని, ముందుగానే దావా వేశారని పేర్కొంటూ ఇందిరా తల్వానీ గతంలో ఇచి్చన నిషేధాజ్ఞల్లో ఒకదాన్ని ఎత్తివేసింది. ఈమెయిల్ బ్యాలెట్ల పంపిణీ బాధ్యతలు చూసే పోస్టల్ విభాగం ఫైనల్ నియమాలను ప్రచురించడంతో డెమోక్రాట్ రాష్ట్రాలు, ఓటింగ్ హక్కుల సంస్థలు తాజాగా మరోసారి కేసులు వేశారు. పోస్టల్ విభాగం కొత్త నియమం ప్రకారం... ఆయా రాష్ట్రాలు ఓటర్ల జాబితాను అందివ్వాలి. బ్యాలెట్ ఎవరికి పంపాలి? ఎన్వలప్‌ల డిజైన్, రకం వంటివి ముందుగానే నిర్ధారించాలి. అంతేకాకుండా.. రాష్ట్రాలు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి; సిటిజన్ డేటాను అప్లోడ్ చేయాలి; ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌ను అప్డేట్ చేయాలి; అధికారులకు శిక్షణ ఇవ్వాలి. అయితే.. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నది ప్రతివాదుల వాదన. ఎన్నికల నియమాలను రూపొందించి అధికారం రాష్ట్రాలకు, అవసరమైతే కాంగ్రెస్‌కు ఉంటాయి కానీ.. పోస్టల్ విభాగం, అధ్యక్షుడు ట్రంప్‌కు కాదని వీరు అంటున్నారు. -
మసాచుసెట్స్ జడ్జిగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దక్షిణాసియాకు చెందిన మరో వ్యక్తిని కీలక పదవికి నామినేట్ చేశారు. భారత సంతతి మహిళ ఇందిరా తల్వానీని మసాచుసెట్స్ జిల్లా జడ్జిగా నియమించారు. ఫస్ట్ సర్క్యూట్‌కు నామినేట్ అయిన తొలి సౌత్ ఏషియా మహిళ ఇందిరానే. ఆమె ప్రస్తు తం బోస్టన్లోని సీగల్రోయిట్మాన్లో భాగస్వామిగా పనిచేస్తున్నారు. సివిల్ లిటిగేషన్ కేసుల్లో రాష్ట్ర, ఫెడరల్ ట్రయల్ కోర్టుల్లో ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. 1988లో ఉత్తర కాలిఫోర్నియా జిల్లా కోర్టు జడ్జి స్టాన్లీ ఏ వెజైల్ దగ్గర లా క్లర్క్‌గా ఇందిరా లీగల్ కెరీర్‌ను ఆరంభించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కాగా, ఒబామా నామినేట్ చేసిన దక్షిణాసియాకు చెందిన వారిలో ఇందిరా మూడో వ్యక్తి కావడం విశేషం. గతంలో దక్షిణాసియాకు చెంది న విన్స్ ఛాబ్రియాను ఉత్తర కాలిఫోర్నియా జిల్లా జడ్జిగా, మనీష్ షాను ఉత్తర ఇల్లినాయిస్ జిల్లా జడ్జిగానూ ఒబామా నియమించిన విషయం తెలిసిందే. -
యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ
అమెరికా (యూఎస్)లో భారత సంతతి మహిళను కీలక పదవి వరించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ఇందిరా తల్వానీని నియమించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా ఆమెను నామినేట్ చేశారు. భారత సంతతి వ్యక్తి మనీష్ షాను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పదవికి ఎంపికైన తొలి దక్షిణాసియా మహిళ ఇందిర కావడం విశేషం. ఇందిర ప్రస్తుతం బోస్టన్లోని సెగల్ రొటిమన్ ఎల్ఎల్పీలో విధులు నిర్వహిస్తోంది. అక్కడే రాష్ట్ర ఫెడరల్ ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ చేసింది. పదోన్నతిపై మసాచూసెట్స్లో న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తారనే నమ్మకముందని ఒబామా అన్నారు.


