ఫేస్‌బుక్‌లో ఆ రికమెన్‌డేషన్‌లుండవు...!

 Facebook To Remove Social Political Group Recommendations - Sakshi

ప్రస్తుత కాలంలో బ్యాంకుల్లో అకౌంట్లు, ఫేస్‌బుక్‌లో అకౌంట్లు లేని వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఫేస్‌బుక్‌లో మనకు తరుచూగా వేరే వ్యక్తులు లేదా గ్రూపులకు సంబంధించిన రికమన్‌డేషనులు వస్తుంటాయి. మనకు ఫలానా వ్యక్తులు లేదా గ్రూపులు నచ్చితే మనం వాటిలో జాయిన్‌ అవుతాం. ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. అంతేకాకుండా సామాజిక సంస్థలు కూడా ఫేస్‌బుక్‌లో గ్రూపులను క్రియేట్‌ చేస్తున్నాయి.

భవిష్యత్తులో రాజకీయ, సామాజిక సంస్థల ఖాతాలను మనకు రికమెన్‌డేషన్‌గా ఈ గ్రూప్‌లు కనిపించవు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ ఈ విషయంపై పనిచేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా గ్రూప్‌లో ఫేస్‌బుక్‌ నియమాలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులను బ్లాక్‌ చేయనుంది. కొన్ని ఫేస్‌బుక్‌ గ్రూపులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి కూడా ఉపయోగిస్తున్నారని పరిశోధకులు, పౌర హక్కుల సంస్థలు చాలాకాలంగా ఫేస్‌బుక్‌ను హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టడానికి సంస్థ పలు చర్యలను తీసుకోవాలని భావించింది. ఏదైనా అంశంపై కొత్తగా సృష్టించే ఫేస్‌బుక్‌ గ్రూపులకు కచ్చితంగా ఫలానా గ్రూపును ఫేస్‌బుక్‌ మానిటర్‌ చేయనుంది. ఫలానా గ్రూప్‌ అర్హత సాధించాలంటే 21 రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉందని ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ టామ్‌ ఎలిసన్‌ తెలిపారు.

కరోనావైరస్ మహమ్మారి సమయంలో, ఫేస్‌బుక్ వినియోగదారులకు హెల్త్‌ గ్రూప్‌లను రికమెన్‌డేషన్‌ చేయడాన్ని ఆపివేసింది. ఈ గ్రూపుల్లో ఉండే వారికి సరైన సమాచారాన్ని ఎక్కువగా అందించలేకపోయాయి , ఆ సమాచారంతో కొంతమంది వ్యక్తులు ఇబ్బందులకు గురైయ్యారని ఫేస్‌బుక్‌ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై దాడికి కొన్ని నెలల ముందు, కొన్ని ఫేస్‌బుక్‌ గ్రూప్‌లు తప్పుడు సమాచారాన్ని, హింసాత్మక సంఘటనలు ప్రేరేపించేలా చేసాయని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఈ గ్రూప్‌లు ఇతర ఫేస్‌బుక్‌ యూజర్లకు రికమెన్‌డేషన్‌ చూపించకుండా ఉన్న పలు ఫేస్‌బుక్‌ గ్రూప్‌లు గణనీయంగా పెరిగాయని ఫేస్‌బుక్‌ తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top