ఎయిరిండియాకు మరోసారి కరోనా సెగ

 Dubai suspends Air India Express operations for COVID-19 passenger - Sakshi

దుబాయ్ : ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సేవలు నిలిపివేత

15 రోజుల పాటు ఎయిండియా  విమానాలు సస్పెన్షన్

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కాలంలో వందేభారత్ మిషన్ కింద విదేశీ ప్రయాణికులను చేరవేస్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సేవలకు మరోసారి కరోనా సెగ తగిలింది. ఎయిరిండియా విమానంలో దుబాయ్ వెళ్లిన ఒక ప్రయాణీకుడికి కోవిడ్-19కు పాజిటివ్ రావడంతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీరియస్ గా స్పందించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలను15 రోజులపాటు నిషేధించింది. ఈ సస్పెన్షన్ సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. 

సెప్టెంబర్ 4న జైపూర్ నుండి దుబాయ్ వచ్చిన ప్రయాణీకుడికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని దుబాయ్ అధారిటీ తన సస్పెన్షన్ నోటీసులో పేర్కొంది. ఇలా వైరస్ సోకిన ప్రయాణీకుడిని గుర్తించకపోవడం ఇది రెండవసారని ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబరు 2వ తేదీన జైపూర్ లోని ఒక డయాగ్నిస్టిక్ సెంటర్ ద్వారా అతనికి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహించారని పేర్కొంది. తద్వారా విమానంలో ఉన్న ఇతర ప్రయాణీకులను ప్రమాదంలో పడేసారనీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రాంతీయ మేనేజరుకు రాసిన లేఖలో ఆరోపించింది.  కరోనా మహమ్మారి కాలంలో ఇరు దేశాల మధ్య కుదరిన ఒప్పందాన్ని ఉల్లంఘించారని మండిపడింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top